AP SSC Hall Tickets : రేపు పదో తరగతి హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు!
03 March 2024, 16:59 IST
- AP SSC Hall Tickets : ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 18 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఎస్ఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను రేపటి నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు.
ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల
AP SSC Hall Tickets : ఏపీ పదో తరగతి(10th Class) వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. పదో తరగతి హాల్ టికెట్లను(AP SSC Hall Tickets) రేపు(మార్చి 3) విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి అధికారిక వెబ్ సైట్ www.bse.ap.gov.in లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. పాఠశాలల లాగిన్ తో పాటు విద్యార్థులు కూడా నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE-AP) పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్(AP SSC Exam Schedule) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హాల్ టిక్కెట్లు రేపటి నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in లో విద్యార్థులు హాల్ టికెట్‌ను డౌన్లోడ్ (AP SSC Hall Tickets Download)చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవచ్చు.
ఏపీ పదో తరగతి (AP SSC Exams)పరీక్షల షెడ్యూల్ (ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు)
- మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
- మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 20 - ఇంగ్లిష్
- మార్చి 22 - గణితం
- మార్చి 23 - ఫిజికల్ సైన్స్
- మార్చి 26 -జీవ శాస్త్రం
- మార్చి 27 -సామాజిక శాస్త్రం
- మార్చి 28 -ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-II (కాంపోజిట్ కోర్సు) , ఒకేషనల్ విద్యార్థులకు మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
- మార్చి 30 - ఒకేషనల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II (అరబిక్, పర్షియన్, సంస్కృతం), ఒకేషనల్ కోర్సు (థియరీ)
AP SSC హాల్ టికెట్ డౌన్లోడ్ ఇలా?
Step 1 : అధికారిక వెబ్‌సైట్‌ను bse.ap.gov.in సందర్శించండి
Step 2 : మెయిన్ పేజీలో AP SSC హాల్ టికెట్లు డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.
Step 3 : మీ వివరాలు నమోదు చేసి, సబ్మిట్ బటన్‌ను నొక్కండి.
Step 4 : తర్వాతి పేజీలో పదో తరగతి హాల్ టికెట్ ను సందర్శించండి.
Step 5 : హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోండి.