AP Govt Jobs 2024 : నెల్లూరు సెంట్రల్ జైలులో ఉద్యోగాలు - పదో తరగతి అర్హతతోనే, వివరాలివే-nellore prisons department invited applications for recruitment of various jobs 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Jobs 2024 : నెల్లూరు సెంట్రల్ జైలులో ఉద్యోగాలు - పదో తరగతి అర్హతతోనే, వివరాలివే

AP Govt Jobs 2024 : నెల్లూరు సెంట్రల్ జైలులో ఉద్యోగాలు - పదో తరగతి అర్హతతోనే, వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 16, 2024 02:29 PM IST

Andhra Pradesh Prisons Department Jobs 2024: ఏపీ జైళ్ల శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా… నెల్లూరు సెంట్రల్ జైలులో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి….

నెల్లూరు సెంట్రల్ జైలులో ఉద్యోగాలు
నెల్లూరు సెంట్రల్ జైలులో ఉద్యోగాలు (http://prisons.ap.gov.in/)

Andhra Pradesh Prisons Department Jobs 2024: ఏపీలో కీలకమైన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పటికే విడుదల కాగా… పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న చిన్న చిన్న ఉద్యోగాల భర్తీకి కూడా ప్రకటనలు జారీ అవుతున్నాయి. తాజాగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా….వైర్ మెన్, బార్బర్ తో పాటు టైలరింగ్ ఇన్ స్ట్రక్టర్ గ్రేడ్ పోస్టును రిక్రూట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీలోపు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. వీటిని ఔట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను చూస్తే…

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - సెంట్రల్ జైలు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ ఖాళీలు - 03

ఖాళీల వివరాలు - టైలరింగ్ ఇన్ స్ట్రక్టర్ గ్రేడ్ 2 -01, వైర్ మ్యాన్ -01, బార్బర్ -01.

అర్హతలు - పదో తరగతి, ఏడో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని చేసిన అనుభవం కూడా ఉండాలి. పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించారు.

జీతం - రూ.15,000 - రూ.18,500

వయోపరిమితి -18- 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం -ఆఫ్ లైన్

దరఖాస్తులకు చివరి తేదీ - ఫిబ్రవరి 24, 2024.

ఎంపిక విధానం - 100 మార్కులను ప్రమాణికంగా తీసుకుంటారు. ఇందులో 50 శాతం అకాడమిక్స్ లో సాధించిన మార్కులు ఉంటాయి. మిగతా మార్కులు పని అనుభవం, స్కిల్ టెస్ట్ కు కేటాయించారు.

పంపాల్సి చిరునామా - Superintendent of jails,.Central prison, Kakuturu Village, Chemudugunta post,Venkatachatam Mandal, SpSR, నెల్లూరు జిల్లా, పిన్ కోడ్ - 524320.

మొబైల్ నెంబర్ - 9985195894)

మెయిల్ -cp-nellore@ap.gov.in

ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చూడొచ్చు….

రామగుండంలో ఉద్యోగాలు

RFCL Job Notification: రామగుండం ఫెర్టిలైజన్స్‌ అండ్ కెమికల్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్‌ఎఫ్‌ఎల్‌, ఈఐఎల్‌, ఎఫ్‌సిఐఎల్‌ జాయింట్ వెంచర్‌ సంస్థ అయిన రామగుండంఫెర్టిలైజర్స్‌ కంపెనీలో మేజేన్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజా నోటిఫికేషన్‌లో మొత్తం 7రకాల ఉద్యాగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో కెమికల్ విభాగంలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 10, మెకానికల్ మేనేజ్‌మెంట్ ట్రైనీలో పోస్టులు 6, ఎలక్ట్రికల్ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 3, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు 3, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనీ పోస్టులు 2, లా మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 1, హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 3 ఉన్నాయి. మొత్తం 28 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆర్‌ఎఫ్‌సిఎల్‌ వెబ్‌ సైట్ https://www.rfcl.co.in కెరీర్స్‌ విభాగంలో పూర్తి వివరాలను చూడవచ్చు. ఫిబ్రవరి 14 నుంచి నోటిఫికేషన్ అందుబాటులోకి రానుంది. మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆర్‌ఎఫ్‌సిఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తారు. నోటిఫికేషన్ సవరణ, అనుబంధ నోటిఫికేషన్, మార్పుల గురించి వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని ఆర్‌ఎఫ్‌సిఎల్ పేర్కొంది.