తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Exams: తెలంగాణలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు… రాష్ట్రంలో 1521 పరీక్షా కేంద్రాలు

TS Inter Exams: తెలంగాణలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు… రాష్ట్రంలో 1521 పరీక్షా కేంద్రాలు

Sarath chandra.B HT Telugu

28 February 2024, 12:48 IST

google News
    • TS Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు (TS Inter Exams) ప్రారంభమయ్యాయి. బుధవారం  నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది పరీక్ష రాయనున్నారు.
తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం (https://tsbie.cgg.gov.in/)

తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం

TS Inter Exams: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ first Inter ఇయర్‌‌లో 4,78,718 మంది, రెండో సంవత్సరంలో 5,02,260 మంది హాజరు కానున్నారు.

ఇంటర్‌ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. తొలిరోజు సెట్‌ 1ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు.

ఇంటర్‌ పరీక్షల్లో నిమిషం one minute late ఆలస్యమైనా అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసినా క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

పరీక్షా కేంద్రాల వద్ద 144Section సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

ఇంటర్‌ రెండో ఏడాది Second Year ప్రైవేటుగా పరీక్షలు రాసేవారు 58,071 మంది ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ కూడా తెలంగాణలో నిర్వహించారు. పరీక్షల నిర్వహణ కోసం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావులేకుండా ఇంటర్‌ బోర్డ్‌ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గత అనుభవాల నేపథ్యంలో పేపర్‌ లీకేజీ ఘటనలకు ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిని విధులకు దూరంగా ఉంచారు.

1,521 ఇంటర్ పరీక్ష కేంద్రాలు...

ఇంటర్‌ పరీక్షలకు 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 407 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, 880 ప్రైవేటు కాలేజీలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారు. పరీక్షలకు 1521 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, ఇదే సంఖ్యలో ప్రభుత్వ అధికారులను పరీక్షలకు వినియోగిస్తున్నారు.

27,900 మంది ఇన్విజిలేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష విధుల్లో ఉన్నారు. 200 సిట్టింగ్‌ స్క్వాడ్లు, 75 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించారు. ఉదయం ఎంపిక చేసిన సెట్‌కు అనుగుణంగా పరీక్షా కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు.

ఇంటర్ విద్యార్థులకు బోర్డ్‌ సూచనలు..

పరీక్ష ప్రారంభమయ్యే 9 గంటలకు ఒక్క నిమి షం ఆలస్యమైనా అనుమతించరు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

పరీక్ష కేంద్రంలో పావుగంట ముందే ఓఎంఆర్‌ షీట్‌ ఇస్తారు. అభ్యర్థి పూర్తి వివరాలను 9 గంటల లోపు చూసుకుని, తప్పులుంటే ఇన్విజిలేటర్‌ దృష్టికి తేవాల్సి ఉంటుంది.

ఒత్తిడి నివారణ కోసం టోల్‌ ఫ్రీ...

పరీక్షలలో ఒత్తిడికి గురయ్యే విద్యార్ధుల కోసం కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి ఇంటర్‌ బోర్డ్‌ 'టెలీ మానస్‌'పేరుతో టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసింది. విద్యార్థులు 14416 లేదా 040-24655027 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.

ఇంటర్ విద్యార్థికి గాయాలు

ఇంటర్‌ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలో ఈ ఘటన జరిగింది. నేరడిగొండ మండలం వడూర్‌ గ్రామానికి చెందిన విష్ణువర్ధన్‌ (17) ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు.

పరీక్ష రాసేందుకు బుధవారం ఉదయం బైక్‌పై ఇచ్చోడకు బయల్దేరాడు. మార్గమధ్యంలో హైవేపై బస్సు నిలిపి ఉండటంతో వెనుక నుంచి బైక్‌ ఢీకొట్టింది. దీంతో విద్యార్థి తలకు బలమైన గాయమైంది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ఇచ్చోడ పీహెచ్‌సీనిక తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు.

తదుపరి వ్యాసం