తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Exams: నేటి నుంచి ఏపీ ఇంటర్‌ పరీక్షలు… రాష్ట్ర వ్యాప్తంగా 1559 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు..

AP Inter Exams: నేటి నుంచి ఏపీ ఇంటర్‌ పరీక్షలు… రాష్ట్ర వ్యాప్తంగా 1559 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు..

Sarath chandra.B HT Telugu

01 March 2024, 7:22 IST

google News
    • AP Inter Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు  ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా  10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం  1,559 సెంటర్లను  ఇంటర్ బోర్డు Inter Board ఏర్పాటు చేసింది. 
నేటి నుంచి ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ప్రారంభం
నేటి నుంచి ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ప్రారంభం

నేటి నుంచి ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ప్రారంభం

AP Inter Exams: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1 శుక్రవారం నుంచి ఇంటర్మీడియట్ Intermediate పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించను న్నారు. తొలిరోజు పరీక్షల కోసం సెట్‌ వన్ ఎంపిక చేసినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ప్రకటించారు.

ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు 8.45 గంటల కల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. శుక్రవారం మొదటి ఏడాది విద్యార్ధులకు పరీక్షలు ప్రారంభం కానుండగా, శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు మొదలవుతాయి.

ఈ విద్యా సంవ త్సరంలో మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వారిలో మొదటి సంవత్సరం పరీక్షలకు 4,73,058 మంది, రెండో సం వత్సరం పరీక్షలకు 5,79,163 మంది హాజరవుతారు. మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను పరీక్షలకు సిద్ధం చేశారు.

పరీక్షల పర్యవేక్షణ కోసం 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను బోర్డు నియమించింది. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ప్రతి జిల్లాకు ఇద్దరు అధికారులను పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు జరిగే ప్రతి తరగతి గదిలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల కెమెరాలతో పరీక్షల్లో నిఘా ఉంచారు.

పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థితో పాటు, సిబ్బంది అటెండెన్స్‌ ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. పరీక్షల సరళిని పర్యవేక్షించేం దుకు ప్రతి జిల్లాలోనూ ఓ కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది.

క్యూ ఆర్ కోడ్‌లతో పరీక్షా పత్రాలు…

ఇంటర్‌ పరీక్షల్లో అవకతవకల్ని నిరోధించడంతో పాటు పేపర్‌ లీక్ అరికట్టడానికి ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పరీక్షల్లో 'డిజిటల్ నిఘా'ను ఏర్పాటు చేసింది.

పరీక్ష పేపర్లకు మూడు దశల్లో 'క్యూఆర్' కోడ్‌ ను జత చేశారు. ప్రశ్నాపత్రాలను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగులైన విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్లలోనే సెంటర్లను కేటాయించడంతో పాటు వారికి మరో గంట అదనపు సమయం కేటాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

దివ్యాంగులైన విద్యార్ధులకు పరీక్ష రాసేందుకు సహాయకులను కూడా అందుబాటులో ఉంచినట్టు ఇంటర్ విద్య కమిషనర్ సౌరభ్ గౌర్ తెలిపారు.ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్షలు ముగిసే వరకు తాడేపల్లిలోని ఇంటర్ విద్య కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు.

పరీక్షల నిర్వహణలో ఫిర్యాదులు, ఫిర్యాదుల స్వీకరణకు 08645-277707, టోల్ ఫ్రీ నంబర్ 18004251531కు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కాల్ చేయొచ్చని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం