తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Lawcet 2024 Results : ఏపీ లాసెట్ 2024-ఫలితాల విడుదల, ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్‌కు డైరెక్ట్ లింక్ ఇదే

AP LAWCET 2024 Results : ఏపీ లాసెట్ 2024-ఫలితాల విడుదల, ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్‌కు డైరెక్ట్ లింక్ ఇదే

HT Telugu Desk HT Telugu

27 June 2024, 19:44 IST

google News
    • AP LAWCET 2024 Results : ఏపీ లాసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి ర్యాంకు కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ లాసెట్ 2024-ఫలితాల విడుదల, ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్‌కు డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ లాసెట్ 2024-ఫలితాల విడుదల, ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్‌కు డైరెక్ట్ లింక్ ఇదే

ఏపీ లాసెట్ 2024-ఫలితాల విడుదల, ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్‌కు డైరెక్ట్ లింక్ ఇదే

AP LAWCET 2024 Results : ఆంధ్రప్రదేశ్ లా కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్) ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఏపీ ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్ఈ) పర్యవేక్షణలో ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ (ఏఎన్‌యూ) ఆధ్వర్యంలో జూన్ 9న జరిగిన ఏపీ లాసెట్, ఏపీపీజీఎల్‌సెట్‌ నిర్వహించారు. ఈ ఫలితాలను గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ లాసెట్ కన్వీనర్ ప్రొఫెస‌ర్‌ బి.సత్యనారాయణ విడుద‌ల చేశారు. లాసెట్‌ను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్స్ లో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 80.06 శాతం ఉతీర్ణత సాధించారు.

ఏపీ లాసెట్‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ వెల్లడించింది. ఏపీలాసెట్ ఫ‌లితాల‌ను, స్కోర్ కార్డు, ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫ‌లితాల‌ను అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_GetResult.aspx లో చెక్ చేసుకోవాలి. అలాగే స్కోర్ కార్డు, ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_GetRankCard.aspx నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫ‌లితాల‌ను ఇలా చెక్ చేసుకోండి?

ఏపీ లాసెట్ ఫ‌లితాల‌ను ఇలా చూడాలి. ముందుగా అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_GetResult.aspx ను క్లిక్ చేయాలి. దాని త‌రువాత క‌నిపించే రెండు బాక్సుల్లోని మొద‌టి బాక్స్‌లో రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌, రెండో బాక్స్‌లోని లాసెట్ హాల్ టిక్కెట్టు నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. ఆ త‌రువాత వ్యూ రిజ‌ల్స్ అనే బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే ఫ‌లితాలు సులువుగా చూడొచ్చు.

ర్యాంక్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ఏపి లాసెట్ కు సంబంధించిన ర్యాంక్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ముందుగా అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_GetRankCard.aspx ను క్లిక్ చేయాలి. దాని త‌రువాత క‌నిపించే మూడు బాక్సుల్లోని మొద‌టి బాక్స్‌లో రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌, రెండో బాక్స్‌లోని లాసెట్ హాల్ టికెటు నెంబ‌ర్, మూడో బాక్స్‌లో పుట్టిన తేదీ ఎంట‌ర్ చేయాలి. ఆ త‌రువాత వ్యూ ర్యాంక్ కార్డు అనే బ‌ట‌న్‌పై క్లిక్ చేస్తే ర్యాంక్ కార్డు ఓపెన్ అవుతుంది. దాన్ని డైరెక్ట గానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కోర్సుల వారీగా వివరాలు

రెండేళ్ల పీజీ కోర్స్ లో పురుషులు 99.51 శాతం, స్త్రీలు 99.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 91.28 శాతం, స్త్రీలు 86.26 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 81.91 శాతం, స్త్రీలు 78.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.

కేటగిరిల వారీగా

బీసీ-ఏ కేటగిరి 100 శాతం, బీసీ-బీ కేటగిరి 98.78 శాతం, బీసీ-సీ కేటగిరి 100 శాతం, బీసీ-డీ కేటగిరి 99.31 శాతం, బీసీ-ఈ క్యాటగిరి 100 శాతం, ఓసీ కేట‌గిరి 99.26 శాతం, ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.

లా సెట్ మూడేళ్ల కోర్సుల్లో

బీసీ-ఏ కేటగిరి 82.03 శాతం, బీసీ-బీ క్యాటగిరి 84.47 శాతం, బీసీ-సీ కేటగిరి 90.8 శాతం, బీసీ-డీ కేటగిరి 84.31 శాతం, బీసీ-ఈ కేటగిరి 81.24 శాతం, ఓసి కేటగిరి 88.8 శాతం, ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సుల్లో

బీసీ-ఏ కేటగిరి 67.29 శాతం, బీసీ-బీ క్యాటగిరి 68.25 శాతం, బీసీ-సీ కేటగిరి 74.36 శాతం, బీసీ-డీ కేటగిరి 71.66 శాతం, బీసీ-ఈ కేటగిరి 65.85 శాతం, ఓసి కేటగిరి 72.93 శాతం, ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ర్యాంకుల వివరాలు

లా సెట్ మూడేళ్ల కోర్స్ లో యామల కృష్ణ చైతన్య (తిరుపతి) 104 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. కె. హర్ష వర్ధన్ రాజు (కోనసీమ) 103 మార్కులతో రెండో ర్యాంకు, చెల్లుబోయిన రేవంత్ రాయ్ (తూర్పు గోదావరి) 98 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు.

ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సు

కుసుమ అగర్వాల్ (విజయనగరం) 92 మార్కులతో ఒకటో ర్యాంక్, ఆర్. పి. విజయనందిని (తెలంగాణ) 91 మార్కులతో రెండో ర్యాంక్, గోపిసెట్టి విజయ ఆదిత్య శ్రీవాస్తవ (విజయవాడ) 88 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు. రెండేళ్ల పీజీఎల్ సెట్‌లో పొట్లూరి అభినీత్ జసన్ 96 మార్కుతో ఫస్ట్ ర్యాంక్, దీప్తి నూకాల (గుంటూరు) 95 మార్కులతో రెండో ర్యాంకు, నువ్వుల జాహ్నవి (విజయవాడ) 94 మార్కులతో మూడో ర్యాంకు సాధించిన వారిలో ఉన్నారని తెలిపారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం