తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Group 1 Prelims Results : త్వరలోనే గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ ఫలితాలు..! ఏ నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక ఉండనుంది..?

TG Group 1 Prelims Results : త్వరలోనే గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ ఫలితాలు..! ఏ నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక ఉండనుంది..?

27 June 2024, 11:05 IST

google News
    • TGPSC Group 1 Prelims Results 2024 : తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు అందుబాటులోకి రాగా… ఏ క్షణమైనా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మెయిన్స్ కు 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పరీక్ష రాసినవారు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు

తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు

TGPSC Group 1 Prelims Results 2024 : తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇప్పటికే కీలు విడుదల కావటంతో పాటు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. మరోవైపు ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు కూడా వెబ్ సైట్ లో అందుబాటులోకి వచ్చాయి.

దాదాపుగా ప్రిలిమ్స్ ఫలితాల విడుదలకు టీజీపీఎస్సీ కసరత్తు పూర్తి కావొచ్చింది.  ఈ రెండు మూడు రోజులు లేదా జూలై తొలివారంలోనైనా రిజల్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి మెయిన్స్ కు ఏ నిష్పత్తిలో ఎంపిక చేస్తారనేది ఉత్కంఠగా మారింది. 

గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షకు 1:50కి బదులుగా 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా భారీ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇదే విషయంపై గతంలో కాంగ్రెస్ లోని పెద్దలు మాట్లాడారని గుర్తు చేస్తున్నారు. ఆ మాటకు కట్టుబడి ప్రస్తుత రిక్రూట్ మెంట్ లో కూడా… మెయిన్స్ కు 1 : 100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరుతున్నారు.

అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుందనేది తేలాల్సి ఉంది. 1 : 50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే దానిపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

జూన్‌ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మరోవైపు… మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్:

గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.

  • జనరల్ ఇంగ్లిష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21
  • పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22
  • పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23
  • పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24
  • పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25
  • పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26
  • పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27.

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను 21/10/2024 నుంచి 27/10/2024 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్ లో మొత్తం 06 పేపర్లు ఉంటాయి. వీటిని అభ్యర్థి ముందుగా ఎంచుకున్న మాధ్యమంలోనే రాయాల్సి ఉంటుంది. పేపర్‌లో కొంత భాగాన్ని ఇతర భాషలో రాయడానికి అభ్యర్థికి అనుమతి లేదు. ఇంగ్లిష్ లో కొంత భాగం, తెలుగు లేదా ఉర్దూలో మిగిలిన భాగం రాయడానికి అనుమతి లేదని టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది.

 

తదుపరి వ్యాసం