AP EDCET Results 2024 : ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు కోసం డైరెక్ట్ లింక్ ఇదే
27 June 2024, 13:39 IST
- AP EDCET Results 2024 : ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. బీడీఈ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు జూన్ 8న ఎడ్ సెట్ పరీక్ష నిర్వహించారు. ఈ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి.
ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు కోసం డైరెక్ట్ లింక్ ఇదే
AP EDCET Results 2024 : ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EdCET Results) ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో టీచర్స్ ట్రైనింగ్ కోర్సులు బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్ఈ) తరపున విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 16న విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి మే 15 వరకు కొనసాగింది.
ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష జూన్ 8న జరిగింది. మొత్తం 9,365 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీ జూన్ 15న విడుదల చేశారు. ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలిపేందుకు మూడు రోజుల సమయం ఇచ్చారు. జూన్ 18 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇచ్చారు. ఏపీ ఎడ్‌సెట్‌కు సంబంధించిన ఫలితాలను ఆంధ్ర యూనివర్సిటీ వెల్లడించింది. ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలను, స్కోర్ కార్డు, ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ నుంచి విడుదల చేసుకోవాలి. అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx లో చెక్ చేసుకోవచ్చు. అలాగే స్కోర్ కార్డు, ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetRankCard.aspx నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలను ఎలా చూడాలి?
ఏపీ ఎడ్‌సెట్ ఫలితాల కోసం తొలుత అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx ను క్లిక్ చేయాలి. దాని తరువాత కనిపించే రెండు బాక్సుల్లోని మొదటి బాక్స్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, రెండో బాక్స్‌లోని ఎడ్‌సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత వ్యూ రిజల్స్ అనే బటన్‌పై క్లిక్ చేస్తే ఫలితాలు సులువుగా చూడొచ్చు.
ర్యాంక్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ఏపీ ఎడ్‌సెట్‌కు సంబంధించిన ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetRankCard.aspx ను క్లిక్ చేయాలి. దాని తరువాత కనిపించే మూడు బాక్సుల్లోని మొదటి బాక్స్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, రెండో బాక్స్‌లోని ఎడ్‌సెట్ హాల్ టికెటు నెంబర్, మూడో బాక్స్‌లో పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. ఆ తరువాత వ్యూ ర్యాంక్ కార్డు అనే బటన్‌పై క్లిక్ చేస్తే ర్యాంక్ కార్డు ఓపెన్ అవుతుంది. దాన్ని డైరెక్టగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు