AP Lawcet Hall Tickets : రేపు ఏపీ లాసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు!-guntur ap lawcet 2024 hall tickets released on june 3rd entrance exam on june 9th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Lawcet Hall Tickets : రేపు ఏపీ లాసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు!

AP Lawcet Hall Tickets : రేపు ఏపీ లాసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు!

AP Lawcet Hall Tickets : ఏపీ లాసెట్ హాల్ టికెట్లు సోమవారం(జూన్ 3) విడుదల చేయనున్నారు. జూన్ 9 లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

రేపు ఏపీ లాసెట్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు!

AP Lawcet Hall Tickets : ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP LAWCET 2024) హాల్ టికెట్లను గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రేపు విడుదల చేయనుంది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ లాసెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

Step 1 : అభ్యర్థులు ఏపీ లాసెట్ అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx పై క్లిక్ చేయండి.

Step 2 : హోమ్ పేజీలో హాల్ టికెట్లు డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.

Step 3 : అభ్యర్థులు లాగిన్ వివరాలు నమోదు చేసి డౌన్ లోడ్ పై క్లిక్ చేయండి.

Step 4 : స్క్రీన్ పై కనిపించే ఏపీ లాసెట్ హాల్ టికెట్ లో అభ్యర్థి వివరాలు చెక్ చేసుకోండి.

Step 5 : తదుపరి అవసరాల కోసం హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకొని హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోండి.

జూన్ 9న ఏపీ లాసెట్ పరీక్ష

ఏపీ లాసెట్ పరీక్షను జూన్ 9వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రొవిజనల్ ఆన్సర్ కీని జూన్ 10న విడుదల చేయనున్నారు. జూన్ 11న కీ పై అభ్యంతర విండోను తెరవనున్నారు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపేందుకు చివరితేదీ జూన్ 12. ఏపీ లా సెట్ రిజిస్ట్రేషన్లు మే 4న ముగిశాయి. రూ.500 ఆలస్య రుసుముతో మే 5 నుంచి మే 11 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. కరెక్షన్ విండో మే 30న ప్రారంభమై జూన్ 1, 2024న ముగిసింది.

తెలంగాణ లాసెట్ హాల్ టికెట్లు విడుదల

తెలంగాణ లాసెట్ - 2024 హాల్ టికెట్లు ఇటీవల అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జూన్ 3వ తేదీన లాసెట్ -2024 ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరగనుంది.

టీజీ లాసెట్ హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • తెలంగాణ లాసెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ Registration Number, పుట్టిన తేదీ, మొబైన్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహిస్తోంది. అభ్యర్థులు 3 సంవత్సరాల లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్ అభ్యర్థులు 45%, ఓబీసీ 42% , ఎస్సీ,ఎస్టీలు 40% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు... జనరల్ 45%, OBC 42%, ఎస్సీ, ఎస్టీ 40% శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించాలి. లా కోర్సుల్లో ప్రవేశాలకు వయోపరిమితి లేదు.

సంబంధిత కథనం