TS LAWCET Hall Tickets 2024 : అలర్ట్.. తెలంగాణ లాసెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ts lawcet hall ticekts 2024 out at https lawcet tsche ac in direct link here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Lawcet Hall Tickets 2024 : అలర్ట్.. తెలంగాణ లాసెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TS LAWCET Hall Tickets 2024 : అలర్ట్.. తెలంగాణ లాసెట్ హాల్ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
May 29, 2024 04:21 PM IST

TS LAWCET Hall Tickets 2024: తెలంగాణ లాసెట్ - 2024 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ లాసెట్ హాల్ టికెట్లు విడుదల
తెలంగాణ లాసెట్ హాల్ టికెట్లు విడుదల

TS LAWCET 2024 Admit Card 2024: తెలంగాణ లాసెట్ - 2024 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చేశాయ్. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 3వ తేదీన లాసెట్ -2024 ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరగనుంది.

Steps to TS LAWCET Hall Tickets 2024 : ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • తెలంగాణ లాసెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ Registration Number, పుట్టిన తేదీ, మొబైన్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహిస్తోంది. అభ్యర్థులు 3 సంవత్సరాల లా కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. జనరల్ అభ్యర్థులు 45%, ఓబీసీ 42% , ఎస్సీ,ఎస్టీలు 40% మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు... జనరల్ 45%, OBC 42%, ఎస్సీ, ఎస్టీ 40% శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించాలి. లా కోర్సుల్లో ప్రవేశాలకు వయోపరిమితి లేదు.

తెలంగాణ లాసెట్ ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ఎల్ఎల్ బీ ఐదేళ్లు, మూడేళ్ల కోర్సులకు వేర్వురు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఎల్ఎల్ఎం కు కూడా ప్రత్యేక ప్రశ్నాపత్రం ఉంటుంది.

మూడు సెషన్లలో పరీక్షలు……

  • జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలు జరుగుతాయి.
  • ఉద‌యం 9 నుంచి 10.30 వ‌ర‌కు మొదటి సెషన్ ఉంటుంది.
  • మ‌ధ్యాహ్నం 12.30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్ ఉంటుంది.
  • సాయంత్రం 4 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు మూడో సెషన్ జరుగుతుంది.
  • తొలి రెండు సెష‌న్ల‌లో మూడేండ్ల లా కోర్సు ప్రవేశాలకు పరీక్షను నిర్వహిస్తారు.
  • చివ‌రి సెష‌న్‌లో ఐదేళ్ల లా కోర్సు, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు ఉంటాయి.

TS Lawcet 2024 Syllabus: తెలంగాణ లాసెట్ సిలబస్ ఇదే

లాసెట్ ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ఎల్ఎల్ బీ ఐదేళ్లు, మూడేళ్ల కోర్సులకు వేర్వురు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. ఎల్ఎల్ఎం కు కూడా ప్రత్యేక ప్రశ్నాపత్రం ఉంటుంది.

TS LLB ఐదేళ్లు, మూడేళ్ల కోర్సు పరీక్షా విధానం…

  • పార్ట్ A - ఇందులో 30 మార్కులు ఉంటాయి. General Knowledge and Mental Ability నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్ B - ఈ సెక్షన్ కు కూడా 30 మార్కులు కేటాయించారు. Current Affairs నుంచి ప్రశ్నలు వస్తాయి.
  • పార్ట్ C - ఈ సెక్షన్ లో 60 మార్కులు ఉంటాయి. Aptitude for the Study of Law నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రధానంగా భారత రాజ్యాంగం నుంచి క్వశ్చన్లు ఉంటాయి. లీగల్ పరిభాషకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి.

LLM పరీక్షా విధానం, సిలబస్…

ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.

  • Part-A: ఈ సెక్షన్ నుంచి 40 మార్కులు ఉంటాయి.JURISPRUDENCE సబ్జెక్ట్ నుంచి 20 ప్రశ్నలు, CONSTITUTIONAL LAW నుంచి 20 మార్కులు ఉంటాయి.
  • Part-B: ఈ పార్ట్ లో 80 మార్కులు ఉంటాయి.
  • PUBLIC & PRIVATE INTERNATIONAL LAW: 16 మార్కులు.
  • BUSINESS AND CORPORATE LAWS: 16 మార్కులు.
  • LABOUR LAW: 16 Questions … 16 మార్కులు.
  • CRIMES and TORTS: 16 మార్కులు.
  • OTHER ALLIED LAWS: 16 మార్కులు.

టీ20 వరల్డ్ కప్ 2024