తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Additional Forces Moved To Amalapuram Over High Tension At Konaseema

konaseema: పోలీసుల గుప్పిట్లో అమలాపురం.. బస్సులు, ఇంటర్నెట్ సేవలు బంద్

HT Telugu Desk HT Telugu

25 May 2022, 10:14 IST

    • కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురం అట్టుడికిపోయింది. నిరసనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో.. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా దళాలను భారీగా మోహరించారు. 144 సెక్షన్ తో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
అమలాపురానికి అదనపు బలగాలు
అమలాపురానికి అదనపు బలగాలు

అమలాపురానికి అదనపు బలగాలు

కోనసీమ జిల్లాలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంగళవారం నిరసనకారులు చేపట్టిన ఆందోళన రణరంగంగా మారటంతో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి ప్రత్యేక దళాలను మోహరించారు. ఇప్పటికే అమలాపురాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్న పోలీసులు.. 144 సెక్షన్ తో పాటు పోలీసు యాక్ట్ ను అమలు చేస్తున్నారు. ఇక కోనసీమకు వచ్చే బస్సు సర్వీసులను కూడా రద్దు చేశారు. మరోవైపు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు డీఐడీ, ఐజీలను సంప్రదిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.

కర్ఫ్యూ విధింపు... ఇంటర్నెంట్ సేవలు బంద్

అమలాపురంలో కర్ఫ్యూ విధించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు నిన్నటి ఘటనపై పూర్తిస్థాయిలో పోస్ట్ మార్టమ్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఆందోళన హింసాత్మకంగా మారటంలో ఎవరి ప్రమేయం ఉందన్న దానిపై ప్రధానంగా ఆరా తీస్తున్నారు. బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. మరోసారి ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితి నెలకొండ చర్యలు తీసుకుంటున్నారు.

అసలు ఏం జరిగిందంటే..

కోనసీమ జిల్లా పేరు మార్పు మంగళవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడంపై చేపట్టిన ఈ నిరసన ర్యాలీ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు అంటించారు. ఈ కారణంగా ఆయన ఇల్లు మంటల్లో చిక్కుకుంది. కుటుంబసభ్యులు ఇంటి నుంచి పోలీసులు బయటకు తీసుకెళ్లారు. వందలాది మంది ఆందోళనకారులు అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లోకి భారీగా చేరుకున్నారు.

పోలీసులపై రాళ్ల దాడి..

ఆందోళన జరుగుతున్న కారణంగా.. పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో.. ఉద్రిక్తత ఎక్కువైంది. కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమంది యువకులు కలెక్టరేట్ వైపు పరుగులు పెట్టారు. ఈ సమయంలోనే ఆందోళన కారులు.. పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. పోలీసులకు,యువకులకు ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో రాళ్ల దాడి నుంచి తప్పించుకున్నారు. తగ్గని.. ఆందోళనకారులు ఎస్పీ వాహనంపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఎస్పీ గన్ మెన్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన నిరసనకారులు.. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మలాపురంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ నివాసం దగ్గరకు చేరుకున్న ఆందోళనకారులు రాళ్లు రువ్వి.. ధ్వంసం చేసి నిప్పంటించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ సమయంలో సతీష్‌ కుమార్‌, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. వారిని రక్షించే క్రమంలో పోలీసులు ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. మరోవైపు భట్నవిల్లిలో నిర్మాణంలో ఉన్న మంత్రికి చెందిన మరో ఇంటికి నిప్పుపెట్టారు ఆందోళనకారులు.

మొత్తంగా కోనసీమ జిల్లా పేరు మార్పు ఏపీలో కొత్త వివాదానికి దారి తీసినట్లు అయింది. ప్రజల విజ్ఞప్తి మేరకే పేరు మార్చామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోనసీమ జిల్లా సాధన సమితి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

టాపిక్