తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Sc On Viveka Case: దర్యాప్తు అధికారిని కొనసాగించడంపై సుప్రీం కోర్టు అభ్యంతరం

SC on Viveka Case: దర్యాప్తు అధికారిని కొనసాగించడంపై సుప్రీం కోర్టు అభ్యంతరం

HT Telugu Desk HT Telugu

29 March 2023, 13:31 IST

  • SC on Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో దర్యాప్తు అధికారిని మార్చాలన్న నిందితుల తరపున పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్య కేసులో రాంసింగ్‌ను కొనసాగించడంపై సుప్రీం కోర్టు అభ్యంతరం తెలిపింది. 

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు

SC on Viveka Case: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు అధికారి రామ్‍సింగ్‍ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎంఆర్ షా అభ్యంతరం తెలిపారు. కేసు విచారణలో జాప్యం జరుగుతుండటంతో మరో దర్యాప్తు అధికారిని నియమించాలంటే శివశంకర్‌ రెడ్డి సతీమణి తులసమ్మ గత వారం పిటిషన్‍‍ దాఖలు చేశారు.

తులసమ్మ పిటిషన్ నేపథ్యంలో సిబిఐ నుంచి నివేదిక తెప్పించుకున్న న్యాయస్థానం, దర్యాప్తులో పురోగతి లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టుకు సీబీఐ నివేదిక చేరింది. తాజా దర్యాప్తు వివరాలను న్యాయస్థానం ముందు ఉంచారు.

మరోవైపు దర్యాప్తు మందకొడిగా సాగడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రామ్‍సింగ్‍తో పాటు మరొకరిని దర్యాప్తు అధికారిగా సూచిస్తే సీబీఐ కోర్టుకు వివరాలు తెలిపింది. దర్యాపులో పురోగతి సాధించనప్పుడు రామ్‍సింగ్‍ను కొనసాగించడంలో అర్థం లేదని న్యాయమూర్తి ఎంఆర్ షా అభిప్రాయపడ్డారు. కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగించినప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొన సాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరోవైపు కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని తులశమ్మ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ విషయాన్ని పరిశీలిస్తామన్న సుప్రీం ధర్మాసనం, మధ్యాహ్నం 2గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. ఏప్రిల్ 15వ తేదీకల్లా వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని సిబిఐ న్యాయస్థానానికి వెల్లడించింది.

కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు అయినా పడుతుందని, ఈలోగా ఏ 5 శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులశమ్మ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటిషన్లపై నిర్ణయాన్ని వాయిదా వేసిన న్యాయమూర్తి తీర్పును మధ్యాహ్నం వెల్లడించనున్నార.