తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Loan App Harassment: లోన్ యాప్ వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

Loan App Harassment: లోన్ యాప్ వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu

26 May 2023, 9:35 IST

    • Loan App Harassment: పోలీసుల హెచ్చరికలు,  ఆంక్షలు, అరెస్టులు జరుగుతున్నా లోన్ యాప్ అగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఆన్‌లైన్‌లో సాగిపోతున్న  లోన్‌ దందాలతో ప్రాణాలు బలైపోతున్నాయి. బలవంతపు వసూళ్ల కోసం  నగ్న చిత్రాలతో బెదిరింపులకు దిగడంతో తాళలేక అన్నమయ్య జిల్లాలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
లోన్ యాప్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న శ్రవణ్ కుమార్ రెడ్డి
లోన్ యాప్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న శ్రవణ్ కుమార్ రెడ్డి

లోన్ యాప్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న శ్రవణ్ కుమార్ రెడ్డి

Loan App Harassment: లోన్‌ యాప్‌ వేధింపులతో అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఎస్‌.శ్రావణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Update: కోస్తాలో వర్షాలు, రాయలసీమలో భగభగలు, ఏపీలో నేడు, రేపు కూడా వర్షాలు

AP Rains Alert: ఏపీలో చల్లబడిన వాతావరణం, పలు జిల్లాల్లో భారీ వర్షం- పిడుగుపాటు హెచ్చరికలు జారీ

AP RGUKT Admissions 2024 : ఏపీ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు, మే 8 నుంచి జూన్ 25 వరకు అప్లికేషన్లు స్వీకరణ

AP ECET 2024: రేపీ ఏపీ ఈసెట్‌ 2024, ఇప్పటికే హాల్‌ టిక్కెట్ల విడుదల చేసిన JNTU కాకినాడ

దయ్యాల వారిపల్లెకు చెందిన రైతు జయరామిరెడ్డి కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి బీటెక్‌ పూర్తిచేసి ఏడాది కాలంగా హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఆరు నెలల కిందట ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్‌లో అప్పు తీసుకున్నాడు. కొంత మొత్తం తిరిగి చెల్లించినా భారీగా తిరిగి చెల్లించాలని వేధిస్తున్నారు.

యాప్‌ నిర్వాహకులు వేధింపులకు గురి చేయడంతో అప్పు తీసుకున్న దానికంటే అధికంగా దాదాపు రూ.3.50 లక్షల వరకు చెల్లించాడు. ఆ తర్వాత కూడా వేధింపులు కొన సాగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అప్పులు తీర్చుకునేందుకు రూ.4 లక్షలు కావాలని తండ్రిని కోరడంతో వారం రోజుల్లో సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చాడు. కొడుకు అవసరాల కోసం ఇప్పటికే కొంత డబ్బును అతని బ్యాంకు ఖాతాలో ఇప్పటికే జమ చేశారు.

ఈ నెల 26న అప్పు తీసుకొచ్చి కొడుక్కి డబ్బు ఇచ్చేందుకు తండ్రి ఏర్పాట్లు చేశారు. శ్రావణ్‌కుమార్‌ రెడ్డి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి తన బంధువుల ఊరైన మొరంపల్లెకు చేరుకుని అక్కడి పూత పల్లేశ్వరస్వామి ఆలయంలోని కిటికీ కమ్మీలకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

గురువారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు మృతుడి తల్లి దండ్రులతో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. శ్రావణ్‌కుమార్‌రెడ్డి తన వెంట కొత్తగా కొనుగోలు చేసిన కొడవలితో పాటు కత్తిని తెచ్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని లోన్‌ యాప్‌ ఆగడాలతో పాటు క్రికెట్‌ బెట్టింగుల కోసం కూడా అప్పులు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.