తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  44 Weekly Special Trains To Visakha, Mahabubnagar, Tirupati, Bangalore Via Vijayawada

Summer Special Trains: విశాఖ, తిరుపతి, బెంగుళూరుకు 44 వీక్లీ స్పెషల్ ట్రైన్స్…

HT Telugu Desk HT Telugu

02 May 2023, 10:53 IST

    • Summer Special Trains:వేసవి‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు నగరాలకు  ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 
వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి ప్రత్యేక రైళ్లు

వేసవి ప్రత్యేక రైళ్లు

Summer Special Trains: వేసవి ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని విశాఖ నుంచి తిరుపతి, మహబూబ్‌నగర్‌, బెంగుళూరులకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. మే, జూన్ నెలల్లో ప్రతి వారం ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

NEET UG Admit Card 2024 : నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP ICET Hall Tickets: ఏపీ ఐసెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదల, మే 6,7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష

AP ECET Hall Tickets: ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టిక్కెట్లు విడుదల, రూ.5వేల జరిమానాతో నేడు కూడా దరఖాస్తుల స్వీకరణ

Nalgonda Ellayya: వీడిన నల్గొండ కాంగ్రెస్‌ నాయకుడు ఎల్లయ్య మర్డర్ మిస్టరీ, ట్రాప్‌ చేసి జగ్గయ్యపేటలో హత్య

ట్రైన్ నంబరు 08585/08586 విశాఖపట్నం-మహబూబ్‌నగర్‌ -విశాఖపట్నం ప్రత్యేక రైలు మే 2వ తేదీ నుంచి జూన్‌ 28వ తేదీ వరకు విశాఖపట్నంలో సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్‌ చేరుకుంటుంది. విశా‌ఖలో ప్రతి మంగళ వారం ఈ రైలు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు మహబూబ్‌నగర్‌లో బుధవారం సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. మే 2 నుంచి జూన్‌ జూన్ 28 వరకు ప్రతి వారం ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజ్‌గిరి, కాచిగూడ, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతుంది.

ట్రైన్ నంబరు 08583/08584 విశాఖపట్నం-తిరుపతి - విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు మే 3వ తేదీ నుంచి జూన్‌ 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నంలో ప్రతి సోమవారం రాత్రి 7.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే బండి తిరుపతిలో మంగళవారం రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ట్రైన్ నంబరు 08543/08544 విశాఖపట్నం-బెంగళూరు- విశాఖపట్నం ప్రత్యేక రైలు మే 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమవారం బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది.