తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 23, 2024: TG Cabinet Expansion : మంత్రి వర్గంలో బెర్తు కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు, ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో హాట్ టాపిక్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 23 Sep 202404:25 PM IST
Telangana News Live: TG Cabinet Expansion : మంత్రి వర్గంలో బెర్తు కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు, ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో హాట్ టాపిక్
- TG Cabinet Expansion : దసరా పండుగలోపు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశాలున్నాయని సమాచారం. దీంతో నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కగా...ఈసారి ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని ఆసక్తిగా మారింది.
Mon, 23 Sep 202402:56 PM IST
Telangana News Live: One State One Digital Card: సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే కార్డు-వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డుపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- One State One Digital Card : రేషన్, హెల్త్ ప్రొఫైల్ సహా సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానం అమలు చేయాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలను పొందేలా చర్యలు చేపట్టాలన్నారు.
Mon, 23 Sep 202412:54 PM IST
Telangana News Live: Hyderabad Rains : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. ఈ రాత్రికి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
- Hyderabad Rains : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదే సమయంలో.. హైదరాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
Mon, 23 Sep 202412:26 PM IST
Telangana News Live: Mla Sunitha Lakshma Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి- గూండా రాజ్యమని హరీష్ రావు విమర్శలు
- Narsapur Mla Sunitha Lakshma Reddy : నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి వద్ద ఆదివారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జన వేడుకల్లో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి వద్ద టపాసులు కాల్చారు.దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
Mon, 23 Sep 202411:41 AM IST
Telangana News Live: Karimnagar : లోయర్ మానేరు డ్యామ్‌లో బోటింగ్.. మధ్యలో దూకేసిన మహిళ.. అంతా ఒక్కసారిగా షాక్!
- Karimnagar : కరీంనగర్ జిల్లాలో విషాదం జరిగింది. ఓ వివాహిత స్పీడ్ బోటు నుంచి నీటిలోకి దూకేసింది. దీంతో బోటులో ఉన్నవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సేఫ్ జాకెట్ విసిరి మహిళను కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ ఎల్ఎండీలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon, 23 Sep 202409:24 AM IST
Telangana News Live: Selfie For Runa Mafi : సెల్ఫీ ఫర్ రుణమాఫీ.. వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రైతులు
- Selfie For Runa Mafi : రుణ మాఫీ కోసం తెలంగాణ రైతులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో.. నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో రైతులు సెల్ఫీలు తీసి సీఎం కార్యాలయానికి పంపారు.
Mon, 23 Sep 202408:07 AM IST
Telangana News Live: IRCTC Hyd Kerala Tour : 7 రోజుల్లో కేరళను చుట్టేయండి-హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ ఇదిగో
- IRCTC Hyd Kerala Tour Package : కేరళలోని ప్రముఖ పర్యటక ప్రదేశాలను కవర్ చేస్తూ ఐఆర్సీటీసీ 7 రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రశాంతమైన హౌస్ బోట్ రైడ్, హిల్ స్టేషన్ లలో స్టే...మరెన్నో సుందరమైన ప్రదేశాలను ఈ టూర్ లో విజిట్ చేయవచ్చు. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
Mon, 23 Sep 202407:13 AM IST
Telangana News Live: Harish Rao : తలాపున సముద్రం ఉన్నా.. చేప ధూపకు ఏడ్చిందంట.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు సెటైర్లు
- Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. కాలువకు గండి పడి 23 రోజులు గడుస్తున్నా.. పూడ్చడం చేతకావడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్.. ఖమ్మం జిల్లా మంత్రులపై ఫైర్ అయ్యారు. హైడ్రా పైనా కీలక వ్యాఖ్యలు చేశారు.
Mon, 23 Sep 202405:29 AM IST
Telangana News Live: TG 10th Memo : పదో తరగతి మెమో పోయిందా.. అయితే ఇలా చేయండి.. తొందరగా డూప్లికేట్ పొందొచ్చు
- TG 10th Memo : ప్రయాణాల్లో, వరదలు వచ్చినప్పుడు, ఇల్లు దగ్ధం అయినప్పుడు.. చాలామంది తమ సర్టిఫికెట్లు కోల్పోతారు. కానీ.. వాటిని తిరిగి పొందడం ఎలానో తెలియక ఇబ్బందులకు గురవుతుంటారు. ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
Mon, 23 Sep 202404:37 AM IST
Telangana News Live: Blast Plan in Hyderabad : దసరా రోజు హైదరాబాద్‌లో బ్లాస్ట్‌కు ప్లాన్.. అప్పుడు తప్పింది.. ఇప్పుడు ఏం చేసేవారో!
- Blast Plan in Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రిజ్వాన్ మకాం వేశాడు. సైదాబాద్ గ్రీన్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్‌కు ఐసిస్‌తో సంబంధం ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు.
Mon, 23 Sep 202404:00 AM IST
Telangana News Live: Siddipet Crime: సిద్దిపేటలో విశాఖ యువకుడి చోరీలు, హైదరాబాద్‌లో పీజీ చదువుతూ జల్సాల కోసం చోరీలు
- Siddipet Crime: జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు, సులభంగా డబ్బు సంపాదించడం కోసం బంగారం దొంగతనం చేయాలనీ నిర్ణయించుకున్నాడు. కస్టమర్ లా ఓ బంగారు దుకాణంలోకి ప్రవేశించి, చూస్తున్నట్లు నటించి బంగారు గొలుసులను ఎత్తుకొని పారిపోయాడు. చోరీకి పాల్పడిన నిందితున్ని సిద్దిపేట పోలీసులు పట్టుకున్నారు.
Mon, 23 Sep 202412:55 AM IST
Telangana News Live: Bandi Sanjay: తిరుమల లడ్డుపై కేంద్రం దృష్టి పెట్టింది.. లడ్డుపై ఎలాంటి సందేహం వద్దన్నబండి సంజయ్
- Bandi Sanjay: తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరా తీస్తున్నారు. లడ్డు పట్ల ఎలాంటి సందేహాలు వద్దు, అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. లడ్డూ లో కల్తీ హిందూ ధర్మం పై దాడి అని అబిప్రాయపడ్డారు.
Mon, 23 Sep 202412:15 AM IST
Telangana News Live: KCR Politics : కారు పార్టీ క్యాడర్‌లో జోష్.. రంగంలోకి గులాబీ బాస్!
- KCR Politics : తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ యాక్టివ్‌గా లేక చాలా రోజులు అయ్యింది. ఇటీవల ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కేసీఆర్ మాత్రం ఎక్కడా స్పందించలేదు. అయితే.. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటారని చాలామంది కామెంట్ చేశారు. కానీ.. అతి త్వరలోనే కేసీఆర్ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తారనే టాక్ బీఆర్ఎస్‌లో నడుస్తోంది.
Mon, 23 Sep 202411:58 PM IST
Telangana News Live: Siricilla Poachers: నాటు బాంబులతో వన్య ప్రాణులను వేటాడే ముఠా గుట్టురట్టు…ఇద్దరి అరెస్ట్
- Siricilla Poachers: నాటు బాంబులు ఉపయోగించి వన్యప్రాణులను వేటాడే ముఠా గుట్టు రట్టు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. ముఠాకు చెందిన ఇద్దరిని ఇద్దరిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారి నుంచి 25 నాటు బాంబులు, ఐదు నైలాన్ వలలు, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.