TG 10th Memo : పదో తరగతి మెమో పోయిందా.. అయితే ఇలా చేయండి.. తొందరగా డూప్లికేట్ పొందొచ్చు-this is the process to retrieve the 10th class marksheet if it is missing ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg 10th Memo : పదో తరగతి మెమో పోయిందా.. అయితే ఇలా చేయండి.. తొందరగా డూప్లికేట్ పొందొచ్చు

TG 10th Memo : పదో తరగతి మెమో పోయిందా.. అయితే ఇలా చేయండి.. తొందరగా డూప్లికేట్ పొందొచ్చు

Basani Shiva Kumar HT Telugu
Published Sep 23, 2024 10:59 AM IST

TG 10th Memo : ప్రయాణాల్లో, వరదలు వచ్చినప్పుడు, ఇల్లు దగ్ధం అయినప్పుడు.. చాలామంది తమ సర్టిఫికెట్లు కోల్పోతారు. కానీ.. వాటిని తిరిగి పొందడం ఎలానో తెలియక ఇబ్బందులకు గురవుతుంటారు. ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

మిస్సైన సర్టిఫికెట్లను ఇలా తిరిగి పొందండి
మిస్సైన సర్టిఫికెట్లను ఇలా తిరిగి పొందండి

అనుకోకుండా చాలామంది తమ సర్టిఫికెట్లను కోల్పోతున్నారు. మళ్లీ తిరిగి ఎలా పొందాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పదో తరగతి మెమో విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలు ఫాలో అయితే.. మిస్సైన పదో తరగతి మెమోను ఈజీగా తిరిగి పొందొచ్చు.

1. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మెమో మిస్ అయ్యిందో.. ఆ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు తొలుత ఫిర్యాదు చేయాలి. వారు వెతుకుతారు.

2. పోలీసులకు దొరక్కపోతే.. ఆ ఫిర్యాదు కాపీని తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్లాలి. మీ సేవలో టెన్త్ మెమో మిస్సింగ్‌కు సంబంధించి దరఖాస్తు చేయాలి.

3. ఆ తర్వాత మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. మీ సేవా నుంచి చేసిన దరఖాస్తును ఆమోదించుకోవాలి. తాము వెతికినా సర్టిఫికెట్ దొరకలేదని పోలీసులు రిపోర్ట్ రాసిస్తారు. మీసేవా కేంద్రానికి వెళ్లి దాన్ని ప్రింట్ తీసుకోవాలి.

4. మీ సేవలో ప్రింట్ తీసుకున్న తర్వాత.. లాయర్ దగ్గరకు వెళ్లి రూ.50 బాండ్ పేపర్‌పై అఫిడవిట్ చేయించాలి.

5. పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీ, మీసేవా నుంచి తీసుకున్న ఫాం, నోటరీ తీసుకొని.. టెన్త్ చదివిన స్కూలుకు వెళ్లాలి.

6. ఆ స్కూలు ప్రధానోపాధ్యాయులు ఓ ఫాం ఇస్తారు. దాన్ని నింపి.. రూ.250 ఛలాన్ తీయాలి. ఎస్టీవో పేరిట ఆ ఛలాన్ ఉంటుంది.

7. ఆ తర్వాత అవన్నీ తీసుకొని మళ్లీ స్కూలుకు వెళ్లాలి. ఛలాన్, అఫిడవిట్‌, పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీ, మీసేనా నుంచి తీసుకున్న ఫాంతో కలిపి.. టెన్త్ మెమో జిరాక్స్, ఆధార్ కార్డు, రెండు పాస్ట్‌పోర్ట్ సైజు ఫొటలు తీసుకొని వెళ్లాలి.

8. ఇవన్నీ పరిశీలించిన తర్వాత.. స్కూలు ప్రిన్సిపల్ ప్రభుత్వ పరీక్షల విభాగం అడిషనల్ జాయింట్ సెక్రెటరీకి రెక్వెస్ట్ లెటర్ రాస్తారు. డూప్లికేట్ మెమో ఇవ్వాలని రిక్వెస్ట్ పెడతారు.

9. ఆ లెటర్‌తో సహా.. అన్ని కాపీలను రెండు సెట్లు జిరాక్స్ తీసి.. ఒకటి స్కూలులో ఇవ్వాలి. ఒరిజినల్ సెట్‌ను పాఠశాల విద్యాశాఖ అడిషనల్ జాయింట్ సెక్రెటరీ ఆఫీసుకు పోస్టు ద్వారా పంపాలి.

10. దాదాపు 15 పని రోజుల తర్వాత డూప్లికేట్ టెన్త్ మెమోను ఇష్యూ చేస్తారు. అది స్కూలుకు వెళ్తుంది. మెమో వచ్చాక ప్రధానోపాధ్యాయులు సమాచారం ఇస్తారు. అప్పుడు వెళ్లి తీసుకోవాలి.