One State One Digital Card: సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే కార్డు-వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డుపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు-hyderabad cm revanth reddy key orders on one state one digital card family digital cards ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  One State One Digital Card: సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే కార్డు-వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డుపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

One State One Digital Card: సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే కార్డు-వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డుపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

One State One Digital Card : రేషన్, హెల్త్ ప్రొఫైల్ సహా సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానం అమలు చేయాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలను పొందేలా చర్యలు చేపట్టాలన్నారు.

సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే కార్డు-వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డుపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

One State One Digital Card : రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రతీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్ తో పాటు సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు రూపొందించాలన్నారు. వన్ స్టేట్... వన్ డిజిటల్ కార్డు విధానంతో ముందుకెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలను పొందేలా చర్యలు చేపట్టాలన్నారు.

ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఆరోగ్య సేవలు

ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్డులోని ప్రతీ ఒక్కరి హెల్త్ పొఫైల్ ఉండాలన్నారు. అర్హులందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్ కు జిల్లాల వారీగా ఒక వ్యవస్థ ఉండాలని సూచించారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు.

ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డుల ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధమవుతోంది. 83 లక్షలకు పైగా కుటుంబాల ఆరోగ్య వివరాలను సేకరించనుంది. ఈ సమాచారాన్ని ప్రత్యేక యాప్ లో ఎంట్రీ చేయనున్నారు. త్వరలోనే డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ కార్డులను జారీ చేయాలని సర్కరార్ భావిస్తోంది. ఈ స్కీమ్ ను త్వరలోనే పట్టాలెక్కించనుంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో వైద్య సిబ్బంది వివరాలను సేకరించనుంది.

ఓ వ్యక్తికి సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారం తెలుసుకునేలా ఈ కార్డులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో సమాచార సేకరణ నుంచి కార్డుల జారీ వరకు అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఇటీవలే డిజిటల్ హెల్త్ కార్డులపై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఇందులో కీలక ఆదేశాలను ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం 83.04 లక్షల కుటుంబాలలోని వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి గడపకు తిరిగి వారి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటల్ రూపంలో యాప్ లో నమోదు చేయాలని మంత్రి అధికారాలను ఆదేశించారు. హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమంలో భాగంగా పర్సనల్ డిటైల్స్, హెల్త్ హిస్టరీ రికార్డులను ప్రత్యేక యాప్ లో నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతి గడపకు వెళ్లి వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించాలని సూచించారు.

వ్యక్తుల సమాచారాన్ని వారి అనుమతితోనే రెండు దశల్లో సేకరించే అవకాశం ఉంది. డిజిటల్ హెల్త్ కార్డులో భాగంగా ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. బార్‌ కోడ్‌ కూడా ఉంటుంది. సర్వే వివరాల నమోదుతో పాటు డిజిటల్ హెల్త్ కార్డుల జారీకి ఐటీ శాఖ నుంచి సహకారం తీసుకోనున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులివ్వడానికి సుమారు రూ.180 కోట్లు అవసరమని ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబరు నెలలోనే హెల్త్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

సంబంధిత కథనం