Bandi Sanjay: తిరుమల లడ్డుపై కేంద్రం దృష్టి పెట్టింది.. లడ్డుపై ఎలాంటి సందేహం వద్దన్నబండి సంజయ్-center has focused on tirumala laddu bandi sanjay assures on quality of laddu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: తిరుమల లడ్డుపై కేంద్రం దృష్టి పెట్టింది.. లడ్డుపై ఎలాంటి సందేహం వద్దన్నబండి సంజయ్

Bandi Sanjay: తిరుమల లడ్డుపై కేంద్రం దృష్టి పెట్టింది.. లడ్డుపై ఎలాంటి సందేహం వద్దన్నబండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Sep 23, 2024 06:25 AM IST

Bandi Sanjay: తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరా తీస్తున్నారు. లడ్డు పట్ల ఎలాంటి సందేహాలు వద్దు, అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. లడ్డూ లో కల్తీ హిందూ ధర్మం పై దాడి అని అబిప్రాయపడ్డారు.

బండి సంజయ్ కుమార్‌, కేంద్ర మంత్రి
బండి సంజయ్ కుమార్‌, కేంద్ర మంత్రి

Bandi Sanjay: తిరుమల లడ్డు కల్తీపై మొన్న ఏపి సీఎం చంద్రబాబు నాయుడు కు లేఖ రాసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. టీటీడీ లో అన్యమతస్తులకు చోటు కల్పించకూడదన్నారు. గతంలోనే టీటీడీ లో అన్యమతస్తుల విషయంలో ఫిర్యాదు చేశానని తెలిపారు. తిరుపతి లడ్డూ లో కల్తీ హిందూ ధర్మం పై దాడని పెర్కొన్నారు. తిరుపతి లడ్డు లో కల్తీ హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమేనని తెలిపారు.

పవిత్రమైన తిరుమల ప్రసాదంలో ఆరోపణలు రావడం సిగ్గు చేటన్నారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు పట్ల ఎలాంటి సందేహాలు వద్దని కోరారు. టీటీడీ లో అన్యమతస్తులకు చోటు కల్పించకూడదన్నారు. గతంలోనే టీటీడీ లో అన్యమతస్తుల విషయంలో ఫిర్యాదు చేశానని తెలిపారు.

కేటీఆర్ కి మీడియా ఫోబియా…

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కు మీడియా ఫోబియా ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుందని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఓటుకు నోటుకు కేసు విచారణ ఎందుకు జరపలేదన్నారు. కాంగ్రెస్ - బిఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కొంతమంది కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత మూట కట్టుకుందన్నారు.

ఓవైసి కి హిందువులను కించపరిచే ఫోబియా…

15 నిమిషాలు కేటాయిస్తే నరికి చంపుతాన్నన ఓవైసీ కి హిందువులను కించపరిచే ఫోబియా ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఎంఐఎం నేతలు ఇప్పటికీ జాతీయ గీతం ఆలపించరని తెలిపారు. ఓల్డ్ సీటిని న్యూ సీటిగా మారుస్తానన్న వ్యాఖ్యలను ముస్లిం పెద్దలే సమర్థించారని తెలిపారు. ఓవైసీ కాలేజి లో ఫ్యాకల్టీ ఉగ్ర వాదిగా పట్టుబడ్డారని ఆరోపించారు.

సెక్యులర్ అనేవాళ్ళు హిందువుల పండుగ ఏనాడైనా జరుపుకున్నారా అని ప్రశ్నించారు. ఉగ్రవాదులను పెంచి పోషించేది ఎంఐఏం పార్టీ అని ఆరోపించారు. వన్ నేషన్ , వన్ ఎలక్షన్ కి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైడ్రా కు వ్యతిరేకం కాదని, నిష్పాక్షికంగా కూల్చివేతలు జరగాలని కోరారు. అక్రమ కట్టడాలకు కారణమైన బిఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు.

సభ్యత్వ నమోదుపై స్పెషల్ డ్రైవ్…

బిజేపి సభ్యత్వంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టామని బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ లో తాను నివాసం ఉండే ప్రాంతంలో డిజిటల్ సభ్యత్వ నమోదులో పాల్గొన్న బండి సంజయ్, 10 కోట్ల సభ్యత్వం నమోదు చేయాలని టార్గెట్ గా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మెంబర్ షిప్ డ్రైవ్ కు అపూర్వ స్పందన లభిస్తుందన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సభ్యత్వ నమోదు వేగంగా జరుగుతుందన్నారు. దేశ వ్యాప్తంగా ఈనెల 25న మెంబర్ షిప్ డ్రైవ్ చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్దేశించిందన్నారు. జాతీయ పార్టీ పిలుపు మేరకు కరీంనగర్ లో రెండు రోజుల పాటు సభ్యత్వ నమోదు డ్రైవ్ నిర్వహించనున్నామని తెలిపారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)