తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 19, 2024: TG Ration Card Applications : కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు - అక్టోబరు 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ, CM రేవంత్ ఆదేశాలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 19 Sep 202403:33 PM IST
Telangana News Live: TG Ration Card Applications : కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు - అక్టోబరు 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ, CM రేవంత్ ఆదేశాలు
- రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే విషయంపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. కొత్త కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై పలు సూచనలు చేశారు. అక్టోబరు 2వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు.
Thu, 19 Sep 202402:40 PM IST
Telangana News Live: Sangareddy News : 45 రోజుల బాలుడు.... చనిపోయిన 10 రోజుల తర్వాత పోస్ట్ మార్టమ్ - కారణమిదే
- చనిపోయిన 10 రోజుల తర్వాత ఓ బాలుడి శవాన్ని బయటికి వెలికి తీశారు. అనారోగ్యానికి గురైన బాలుడికి చికిత్స అందించిన ఓ ప్రైవేటు ఆస్పత్రిపై సంగారెడ్డి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. పోస్టుమార్టమ్ నివేదికను ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.
Thu, 19 Sep 202412:21 PM IST
Telangana News Live: TG DSC Results 2024 : పూర్తికావొచ్చిన కసరత్తు - ఏ క్షణమైనా డీఎస్సీ ఫలితాలు..!
- తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెట్ వివరాల సవరణ అవకాశం కూడా ముగిసింది. దీంతో ఏ క్షణంలోనైనా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… నియామక పత్రాలు అందజేస్తారు.
Thu, 19 Sep 202411:49 AM IST
Telangana News Live: TG EAPCET 2024 : ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే
- తెలంగాణలోని బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఫలితాలు విడుదలై దాదాపు మూడు నెలల కావొస్తోంది. ఎట్టకేలకు అధికారులు కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించారు. సెప్టెంబర్ 27న సీట్లను కేటాయించనున్నారు.
Thu, 19 Sep 202410:14 AM IST
Telangana News Live: TG Employees : సీపీఎస్ వర్సెస్ ఓపీఎస్.. ఉద్యోగులకు ఏ పెన్షన్ స్కీమ్ మేలు చేస్తుంది.. ఎందుకు?
- TG Employees : సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని ఏళ్ల తరబడి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఆందోళనలు చేశారు. అటు రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంపై హామీలు ఇచ్చి ఓట్లు దండుకుంటోంది. కానీ.. ఉద్యోగుల డిమాండ్ మాత్రం నెరవేరలేదు. అసలు ఓపీఎస్, సీపీఎస్‌లో ఉద్యోగులకు ఏదీ మేలు అనే చర్చ జరుగుతోంది.
Thu, 19 Sep 202409:54 AM IST
Telangana News Live: BC Overseas Scholarships : విదేశాల్లో చదవాలనుకునే వారికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం - విద్యానిధి దరఖాస్తులు ప్రారంభం
- BC Overseas Vidya Nidhi Scholarship : తెలంగాణలో బీసీ, ఈబీసీ విద్యార్ధులకు అమలు చేస్తున్న విదేశీ విద్యానిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన జారీ అయింది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 15వ తేదీతో ఈ గడువు పూర్తి కానుంది.
Thu, 19 Sep 202408:14 AM IST
Telangana News Live: TG Dasara Holidays 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులు సెలవులు
- TG Dussehra Holidays 2024 : తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు వరుసగా 13 రోజులు మూతపడనున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు వచ్చాయి. గాంధీ జయంతి మొదలు.. దసరా వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అటు కొన్ని ప్రైవేట్ పాఠాశాలలకు 14 రోజులు సెలవులు ఇవ్వనున్నారు.
Thu, 19 Sep 202407:13 AM IST
Telangana News Live: Local Body Election : ఓటర్ లిస్టులో మహిళలే అధికం.. ముసాయిదా విడుదల చేసిన అధికారులు
- Local Body Election : స్థానిక సంస్థల ఎన్నికల కోసం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మహిళలే అధికంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపోటములను మహిళా ఓటర్లే శాసించే అవకాశముంది. కరీనంగర్ జిల్లా పంచాయతీ అధికారులు ఓటర్ల జాబితాను ప్రకటించి.. అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు.
Thu, 19 Sep 202406:36 AM IST
Telangana News Live: Mahabubabad : హాస్టల్ వార్డెన్‌ను చితక్కొట్టిన స్టూడెంట్ బంధువులు.. కారణం ఏంటో తెలుసా?
- Mahabubabad : వార్డెన్ అంటే.. హాస్టల్‌లో ఉన్న పిల్లలకు రక్షణగా ఉండాలి. వారి బాగోగులు చూసుకోవాలి. కానీ.. మహబూబాబాద్‌లో ఓ వార్డెన్ వక్ర బుద్ధి ప్రదర్శించాడు. దీంతో విద్యార్థిని బంధువులు సదరు వార్డెన్‌కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
Thu, 19 Sep 202406:02 AM IST
Telangana News Live: Johnny Master Arrest : జానీ మాస్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. కాసేపట్లో హైదరాబాద్‌కు తరలింపు!
- Johnny Master Arrest : అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాజాగా అయన్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు లైంగిక దాడి జరిగిందని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు పెట్టారు.
Thu, 19 Sep 202405:10 AM IST
Telangana News Live: Telangana Police : హోంగార్డులు ఏం పాపం చేశారు.. 19వ తారీఖు వచ్చినా జీతాలు ఇవ్వరా?
- Telangana Police : హోంగార్డులు.. పోలీస్ శాఖలో చిరుద్యోగులు. తక్కువ వేతనం వస్తున్నా.. ఇష్టంతో పని చేస్తారు. కానీ.. ఆ తక్కువ వేతనం కూడా సమయానికి ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. ఫస్ట్ తారీఖు అయిపోయి 18 రోజులు గడుస్తున్నా.. ఇంకా ఆగస్టు నెల జీతం రాలేదని చెబుతున్నారు.
Thu, 19 Sep 202401:52 AM IST
Telangana News Live: Bandi Sanjay: పిడికెడు మందికి భయపడేది జాతీయ పార్టీ అవుతుందా? ఒవైసీకి భయపడ్డారని ఎద్దేవా చేసిన బండి సంజయ్
- Bandi Sanjay: మా వల్లే తెలంగాణ వచ్చింది... మేం బిల్లు పెడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది...అని చెప్పుకుంటున్న పార్టీలు తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలను విస్మరిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.
Thu, 19 Sep 202401:16 AM IST
Telangana News Live: Karimnagar Crime: రెచ్చిపోయిన అంతరాష్ట్ర దొంగలు,కరీంనగర్‌లో ఓ ముఠాకు చెందిన ముగ్గురి అరెస్ట్
- Karimnagar Crime: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దొంగలు రెచ్చి పోయారు. పోలీసుల పేరు చెప్పి కరీంనగర్ లో బైక్ తో సహా దొంగ పారిపోగా, జగిత్యాల జిల్లాలో బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్న వ్యక్తిని అటకాయించి సినీపక్కిలో లక్షా 68 వేలు ఎత్తుకెళ్లారు. నిఘా పెట్టిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
Thu, 19 Sep 202401:01 AM IST
Telangana News Live: Bhadraclam Priest: కోడలిపై భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడి లైంగిక వేధింపులు, ఏపీలో కేసు నమోదు, సస్పెన్షన్
- Bhadraclam Priest: కోడలిని వేధింపులకు గురి చేసిన భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీలోని పశ్చిమగోదావరిలో ఆలయ ప్రధానార్చకుడిపై పోలీస్ కేసు నమోదు కావడంతో తెలంగాణ దేవాదాయశాఖ చర్చలకు ఉపక్రమించింది. ఆలయ ప్రధానార్చకుడిపై వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి.