TG Dasara Holidays 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులు సెలవులు-dussehra holidays in telangana from 2nd october to 14th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dasara Holidays 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులు సెలవులు

TG Dasara Holidays 2024 : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏకంగా 13 రోజులు సెలవులు

Basani Shiva Kumar HT Telugu
Sep 19, 2024 02:50 PM IST

TG Dussehra Holidays 2024 : తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు వరుసగా 13 రోజులు మూతపడనున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు వచ్చాయి. గాంధీ జయంతి మొదలు.. దసరా వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అటు కొన్ని ప్రైవేట్ పాఠాశాలలకు 14 రోజులు సెలవులు ఇవ్వనున్నారు.

స్కూళ్లకు దసరా సెలవులు
స్కూళ్లకు దసరా సెలవులు

తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా 13 రోజులు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు.

కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపాయి. వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. ఊర్లకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం మే 25న 2024-25 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించిన క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 2 నుంచి 14వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు, డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మ‌స్ సెల‌వులు, జ‌న‌వ‌రి 13 నుంచి 17వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించారు. 2025, ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. 2025 ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ లోపు ప‌దో త‌ర‌గ‌తి ప్రి ఫైన‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. 2025 మార్చిలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత 14, 15, 16వ తేదీల్లోనూ సెలవులు వచ్చాయి. 17వ తేదీన కొన్ని ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవు ఇచ్చారు. ఇటు సెప్టెంబర్ 22, 28, 29 తేదీల్లోనూ స్కూళ్లకు సెలవు రానుంది. దీంతో సెప్టెంబర్, ఆక్టోబర్ నెలలో స్కూళ్లకు ఎక్కువగా హాలీడేస్ వచ్చాయి. మరోవైపు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో మళ్లీ స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం లేకపోలేదు.

అటు పండుగలకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఈసారి రైలు టికెట్లు దొరకడం కష్టంగానే ఉంది. దసరా, దీపావళి పండగలు రాకముందే సంక్రాంతికి రైలు టిక్కెట్లకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. జనవరిలో హైదరాబాద్‌ నుంచి బయలుదేరే రైళ్ల టిక్కెట్లన్నీ అయిపోయాయి. కనీసం వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లయినా బుక్ చేద్దాం.. పండగ నాటికి రిజర్వేషన్‌ ఖరారు కాకపోదా? అని ఆశపడేవారికీ ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. దసరా సెలవుల నేపథ్యంలోనూ రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు.