TG Schools Reopen : నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం - మారిన టైమింగ్స్, అకడమిక్‌ క్యాలెండర్ వివరాలివే-schools will reopen in telangana from today latest updates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Schools Reopen : నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం - మారిన టైమింగ్స్, అకడమిక్‌ క్యాలెండర్ వివరాలివే

TG Schools Reopen : నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం - మారిన టైమింగ్స్, అకడమిక్‌ క్యాలెండర్ వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 12, 2024 07:32 AM IST

Schools Reopen in Telangana: తెలంగాణలో వేసవి సెలవులు ముగిశాయి. ఇవాళ్టి నుంచే పాఠశాలలు తిరిగి పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ‘బడిబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

తెలంగాణలో ఇవాళ్టి నుంచే బడులు ప్రారంభం
తెలంగాణలో ఇవాళ్టి నుంచే బడులు ప్రారంభం

Schools Reopen in Telangana: ఇవాళ్టి నుంచి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు జూన్ 11వ తేదీ నాటికి పూర్తికాగా… నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం షురూ కానుంది. ప్రభుత్వ బడుల్లో పిల్లల చేరికలను ప్రోత్సహించేందుకు సర్కార్ బడి బాట కార్యక్రమాన్ని చేపట్టింది.జూన్ 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

మారిన సమయం….

ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల్ని ఈ ఏడాది నుంచి ఉదయం 9గంటలకే ప్రారంభించనున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో బోధన 8 గంటలకే ప్రారంభం అవుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 9.30కు మొదలు కావడంపై పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సమయ పాలనలో పలు మార్పులు చేసింది.

మరోవైపు కొత్త విద్యా సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 90శాతం విద్యార్ధుల హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో ఇకపై ప్రతిరోజు కనీసం 90శాతం మంది విద్యార్ధులు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. పాఠశాలల్లో హాజరు శాతం పెంచడానికి పేరెంట్స్ కమిటీలు, విద్యా కమిటీలు, స్థానిక స్వచ్ఛంధ సంస్థలు, ఉపాధ్యాయులను భాగస్వామ్యుల్ని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రతి నెలలో 4వ శనివారం నో బ్యాగ్‌ డే అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిత్యం అరగంట పాటు పాఠ్యపుస్తకాల పఠనం, కథల పుస్తకాలు పఠనం, దినపత్రికలు, మ్యాగ్‌జైన్లను చదివించాలని నిర్ణయించారు. టీశాట్ టీవీ పాఠాలను ప్రసారం చేయాలి. జనవరి 10వ తేదీ నాటికి విద్యాబోధన పూర్తి చేయాలని ఆదేశించారు.

విద్యా సంవత్సర క్యాలెండర్ ఇదే…

  • జూన్‌ 12, 2024 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2025, ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి.
  • అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు 5 రోజుల పాటు క్రిస్మస్‌ సెలవులు కాగా, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు.
  • 2025, ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
  • రాష్ట్రంలోని హైస్కూల్స్ ఉద‌యం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంట‌ల వ‌ర‌కు, అప్పర్ ప్రైమ‌రీ స్కూల్స్ ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4.15 గంట‌ల వ‌ర‌కు పని చేస్తాయి.
  • ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూల్స్ పనిచేయనున్నాయి. జూన్ 12, 2024న ప్రారంభమై ఏప్రిల్‌ 23, 2025తో ముగుస్తాయి.
  • ఏప్రిల్ 24, 2025 నుంచి జూన్ 11, 2025 మొత్తం 49 రోజులు ఈ విద్యాసంవత్సరంలో వేసవి సెలవులు ఉంటాయి. అలాగే అక్టోబర్ 13 నుంచి 25 వరకు మొత్తం 13 రోజుల దసరా సెలవులు ప్రకటించారు.
  • వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. దీంతో పాటు ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో 5 నిమిషాల యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండాయని ప్రకటించింది.
  • జులై 31, 2024లోగా ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌-1 పరీక్షలు, సెప్టెంబర్ 30, 2024 లోపు ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌-2 పరీక్షలను నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 21 నుంచి 28 వరకు సమ్మేటివ్‌ అసెస్మెంట్‌-1 పరీక్షలు, డిసెంబర్ 12 లోపు ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌-3 పరీక్షలు ఉంటాయి.
  • జనవరి 29, 2025 లోపు ఫార్మేటివ్‌ అసెస్మెంట్‌-4 పరీక్షలను, వచ్చే ఏడాది ఏప్రిల్ 9 నుంచి 29 వరకు సమ్మేటివ్‌ అసెస్మెంట్‌-2 పరీక్షలను(1 నుంచి 9 క్లాస్ లకు) నిర్వహించనున్నారు.
  • పదో తరగతి విద్యార్థులు 2025 ఫిబ్రవరి 28లోపు ప్రీ ఫైనల్ నిర్వహించున్నారు. మార్చి, 2025లో పదో తరగతి ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొంది.

Whats_app_banner