10th Result : జూన్ 30న పదో తరగతి ఫలితాలు.. ఇలా చూసుకోవాలి
తెలంగాణ పదో తరగతి ఫలితాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 30న రిజల్ట్ విడుదల కానున్నాయి.
తెలంగాణ పదో తరగతి ఫలితాలు జూన్ 30న విడుదల అవనున్నాయి. ఎస్ఎస్ సీ బోర్డు అధికారులు దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారు. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లేదా www.bseresults.telangana.gov.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
మే 23 నుంచి మే 25 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. వీరిలో 2,58,098 మంది బాలురు, 2,51,177 మంది బాలికలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, సిలబస్ వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో మార్పులు చేసింది తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు. సిలబస్ ను 80 శాతం తగ్గించింది. ఈ మేరకు పరీక్షా పేపర్ లను 11 నుంచి 6 పేపర్లకు కుదించారు. ఫిజిక్స్, బయాలజీ పేపర్లకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జూన్ 1తో ముగియగా.. ఆ తర్వాతి.. రెండో రోజు జూన్ 2 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ స్పాట్ వ్యాల్యుయేషన్ మెుదలైంది. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను జూన్ 30న ప్రకటించాలని విద్యాశాఖ ముమ్మరంగా కసరత్తు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తర్వాత ఈ జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
సంబంధిత కథనం
టాపిక్