తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live October 9, 2024: Karimnagar Politics : హీటెక్కిన కరీంనగర్ మున్సిపల్ రాజకీయం, మేయర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 09 Oct 202404:58 PM IST
Telangana News Live: Karimnagar Politics : హీటెక్కిన కరీంనగర్ మున్సిపల్ రాజకీయం, మేయర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- Karimnagar Politics : కరీంనగర్ మున్సిపల్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. మేయర్ వర్సెస్ కార్పొరేటర్ ఫైట్ లో ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఇప్పటికే మేయర్ పై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా... కమిషనర్ పై కూడా కేసు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Wed, 09 Oct 202404:36 PM IST
Telangana News Live: Photography Short Film Competition : పోలీస్ థీమ్ తో ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు, అక్టోబర్ 20 చివరి తేదీ
- Photography Short Film Competition : పోలీస్ అమరవీరుణ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేరష్ తెలిపారు. పోలీసుల ప్రతిభ, త్యాగాలకు సంబంధించి వీడియో, ఫొటోలు, షార్ట్ ఫిల్మ్ తీసి ఈ నెల 20 లోపు పంపాలన్నారు.
Wed, 09 Oct 202402:33 PM IST
Telangana News Live: Manikonda DEE : మణికొండ మాజీ డీఈఈ ఇంట్లో నోట్ల కట్టలు- వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన భర్త
- Manikonda DEE : మణికొండ మాజీ డీఈఈ దివ్య జ్యోతి భారీగా లంచం తీసుకుంటున్నారని ఆమె భర్త ఆరోపించారు. ఆమె లంచంగా తీసుకున్న డబ్బు ఇంట్లో ఎక్కడెక్కడ పెడుతున్నారో... ఆమె భర్త వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
Wed, 09 Oct 202401:27 PM IST
Telangana News Live: CM Revanth Reddy : డీఎస్సీ ఇచ్చిన 65 రోజుల్లోనే 10 వేల మందికి నియామకపత్రాలు- సీఎం రేవంత్ రెడ్డి
- CM Revanth Reddy : డీఎస్సీ-2024 లో ఎంపిక అభ్యర్థులకు ఉపాధ్యాయ నియామక పత్రాలను అందించారు సీఎం రేవంత్ రెడ్డి. మిమ్మల్ని చూస్తోంటే దసరా పండుగ ముందే వచ్చినట్లుందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 65 రోజుల్లోనే 10,006 ఉపాధ్యాయ నియామకపత్రాలు అందించామన్నారు.
Wed, 09 Oct 202411:24 AM IST
Telangana News Live: SC Categorisation : ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య కమిషన్.. ఆ తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు - సీఎం రేవంత్ రెడ్డి
- ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు.ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ సమర్పించాలని దిశానిర్దేశం చేశారు.
Wed, 09 Oct 202410:34 AM IST
Telangana News Live: TGPSC Group 1 Mains 2024 : గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్... ఈనెల 14న మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల, 21 నుంచి పరీక్షలు
- TGPSC Group 1 Mains Hall Tickets : తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈనెల 14వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. 21వ తేదీ నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
Wed, 09 Oct 202410:07 AM IST
Telangana News Live: TG TET DSC Notification : త్వరలోనే టెట్, మరోసారి డీఎస్సీ నోటిఫికేషన్..! ముఖ్యమైన 7 అంశాలు
- తెలంగాణలో త్వరలోనే టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఓ DSC ప్రక్రియ దాదాపు పూర్తి కాగా...వచ్చే నెలలో మరోసారి టెట్ ప్రకటన వెలువడనుంది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. జనవరిలో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంటుంది.
Wed, 09 Oct 202409:02 AM IST
Telangana News Live: Coastal Karnataka Tour : హైదరాబాద్ టు కర్ణాటక... ఈనెలలోనే ట్రిప్, గోకర్ణ, మురుడేశ్వర్ చూడొచ్చు - టూర్ ప్యాకేజీ వివరాలివే
- కర్ణాటక తీర ప్రాంతాన్ని చుట్టేయాలనుకుంటున్నారా..? మీలాంటి వారికోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. ట్రైన్ జర్నీ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి…
Wed, 09 Oct 202406:05 AM IST
Telangana News Live: OU Distance Admissions 2024 : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు - ఇలా దరఖాస్తు చేసుకోండి
Osmania University Distance Education : ఓయూ దూర విద్యలో తొలి విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమాతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరవచ్చు. https://oupgrrcde.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
Wed, 09 Oct 202405:19 AM IST
Telangana News Live: London Love: టాక్సీ డ్రైవర్ మోజులో లండన్ నుంచి వచ్చేసిన వివాహిత, గోవాలో పట్టుకున్న పోలీసులు
- London Love: పెళ్లై ఇద్దరు పిల్లలు తల్లైన యువతి ఓ టాక్సీ డ్రైవర్‌పై మోజుతో భర్త, పిల్లల్ని వదిలేసి లండన్ నుంచి హైదరాబాద్ వచ్చేసింది. భార్య కనిపించక పోవడంతో పోలీసుల్ని ఆశ్రయించడంతో ఓ టాక్సీ డ్రైవర్ కోసం ఇండియా వచ్చేసినట్టు గుర్తించి అవాక్కయ్యారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి లండన్ విమానం ఎక్కించారు.
Wed, 09 Oct 202403:31 AM IST
Telangana News Live: TG EAPCET BiPC: బీఫార్మసీ, డీ ఫార్మసీ, బయో టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్
- TGEAPCET BiPC 2024: తెలంగాణ ఈఏపీ సెట్ 2024లో భాగంగా బైపీసీ విద్యార్ధులకు బీఫార్మసీ, డీ ఫార్మసీ,ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
Wed, 09 Oct 202402:01 AM IST
Telangana News Live: Karimnagar Crime: కరీంనగర్ లో ఇద్దరు చైన్ స్నాచర్లు,బంగారం కొన్న వ్యక్తి అరెస్ట్, బంగారం స్వాధీనం
- Karimnagar Crime: కరీంనగర్ లో చైన్ స్నాచర్ల ఆట కట్టించారు పోలీసులు. ఇద్దరు చైన్ స్నాచర్లతో పాటు చోరీ చేసిన బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ముగ్గురి నుంచి 105.85 గ్రాముల బంగారంతో పాటు రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.