Photography Short Film Competition : పోలీస్ థీమ్ తో ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు, అక్టోబర్ 20 చివరి తేదీ
Photography Short Film Competition : పోలీస్ అమరవీరుణ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేరష్ తెలిపారు. పోలీసుల ప్రతిభ, త్యాగాలకు సంబంధించి వీడియో, ఫొటోలు, షార్ట్ ఫిల్మ్ తీసి ఈ నెల 20 లోపు పంపాలన్నారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు. విద్యార్థులతో పాటు యువత, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, షార్ట్ ఫిల్మ్ మేకర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని ఈ పోటీలు ఉంటాయని తెలిపారు.
అంశాలు :
పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఇటీవల కాలంలో తీసిన 3 ఫొటోలు, తక్కువ నిడివి 3 నిమిషాలు గల షార్ట్ ఫిల్మ్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20వ తేదీ లోపు పెన్ డ్రైవ్ లో కానీ సీడీలో కానీ పోలీసు పీఆర్ఓ కు అందజేయాలని తెలిపారు. పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాల్లో పోలీసుల సేవ, ఇతర సందర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2023 అక్టోబర్ నుంచి అక్టోబర్ నెల ఇప్పటివరకు తీసిన మూడు ఫొటోలు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 8712539040 నెంబర్ ద్వారా పీఆర్ఓ ను సంప్రదించాలన్నారు. జిల్లాస్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ గా నిలిచిన ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ షార్ట్ ఫిలిమ్ ను రాష్ట్రస్థాయి కాంపిటీషన్ కు పంపిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారికి నగదు పురస్కారం ఉంటుందన్నారు.
ఆత్మహత్యలకు ఎక్కువగా పురుగుల మందు
ఆత్మహత్యలకు ఎక్కువగా పురుగుల మందునే వినియోగిస్తున్నారని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు నివారించడానికి ఫర్టిలైజర్స్ షాప్ యజమానులతో మాట్లాడి, అనుమానిత వ్యక్తులకు ఫర్టిలైజర్స్ అమ్మకుండా చూడాలన్నారు. రైతులకు మాత్రమే ఫర్టిలైజర్స్ అమ్మే విధంగా షాప్ యజమానులను గైడ్ చేయాలని అధికారులకు సూచించారు. నేరాలను అదుపు చేయడానికి, జరిగిన నేరాలను డిటెక్ట్ చేయడంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు.
గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సూచించారు. జిల్లాలో ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా, తరచూ వెహికిల్ చెకింగ్ నిర్వహిస్తూ, అనుమానిత వెహికిల్స్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. మట్కా గ్యాంబ్లింగ్ నిర్వాసితులపై ప్రత్యేక నిఘా ఉంచి, ముందస్తుగా బైండోవర్ చేయాలన్నారు.
నూతన చట్టాల ప్రకారం అవసరం ఉన్న కేసులలో ముందస్తుగా డీఎస్పీ నుంచి అనుమతి పొంది ప్రథమ విచారణ చేసిన తరువాతనే కేసును నమోదు చేయాలని యస్.హెచ్.ఒ లకు సూచించారు. ఏ కేసులో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఎస్పీ తన అనుభవ పూర్వక సలహాలు సూచనలు చేశారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను ఛేదించడానికి ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు.
సంబంధిత కథనం