Coastal Karnataka Tour : హైదరాబాద్ టు కర్ణాటక... ఈనెలలోనే ట్రిప్, గోకర్ణ, మురుడేశ్వర్ చూడొచ్చు - టూర్ ప్యాకేజీ వివరాలివే-irctc tourism operated coastal karnataka tour package from hyderabad in october 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Coastal Karnataka Tour : హైదరాబాద్ టు కర్ణాటక... ఈనెలలోనే ట్రిప్, గోకర్ణ, మురుడేశ్వర్ చూడొచ్చు - టూర్ ప్యాకేజీ వివరాలివే

Coastal Karnataka Tour : హైదరాబాద్ టు కర్ణాటక... ఈనెలలోనే ట్రిప్, గోకర్ణ, మురుడేశ్వర్ చూడొచ్చు - టూర్ ప్యాకేజీ వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 09, 2024 02:32 PM IST

కర్ణాటక తీర ప్రాంతాన్ని చుట్టేయాలనుకుంటున్నారా..? మీలాంటి వారికోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. ట్రైన్ జర్నీ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి…

హైదరాబాద్ - కర్ణాటక
హైదరాబాద్ - కర్ణాటక (image source unsplash.com)

ఈ అక్టోబర్ నెలలో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకునే ప్లాన్ ఉందా..? మీలాంటి వారి కోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతంలో కొలువుదీరిన పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు.

ఈ కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం అక్టోబర్ 15, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ముఖ్య వివరాలు - టూర్ షెడ్యూల్ :

  • IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది.
  • హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ట్రైన్ జర్నీ ఉంటుంది.
  • మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు.
  • https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
  • ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ.38,810ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22520 ధరగా ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18020గా ఉంది. కంఫర్ట్ క్లాస్ 3Aలో ఈ ధరలు ఉంటాయి. స్టాం
  • స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15020గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 35810గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 19520గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.
  • హైదరాబాద్ - కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085

షెడ్యూల్ :

  • మొదటి రోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 రైలు బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది.
  • 2 రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు.
  • మూడో రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.
  • నాల్గొ రోజు Hornadu కు చేరుకుంటారు. Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు.
  • ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. మంగళాదేవీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.
  • ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

Whats_app_banner

సంబంధిత కథనం