IMD yellow alert : కర్ణాటకతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు- ఐఎండీ అలర్ట్!
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల్లో సెప్టెంబర్ 29న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ మేరకు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఆదివారం.. గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఐఎండీ వర్ష సూచన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా వర్షాలు..
ఐఎండీ తన తాజా వాతావరణ నివేదికలో దేశంలోని పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.
అక్టోబర్ 3వ తేదీ వరకు పశ్చిమ భారతంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 2 నుంచి సౌరాష్ట్ర, కచ్‌లలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో అక్టోబర్ 2 నుంచి 4 వరకు, అసోం, మేఘాలయలో 2, 3 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ సెప్టెంబర్ 28న విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది.
అక్టోబర్ 1న అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అక్టోబర్ 4 వరకు మధ్య భారతంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
అక్టోబర్ 5 వరకు ఉత్తరాఖండ్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా-చండీగఢ్-దిల్లీ, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 30 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా రానున్న పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వివరించింది.
సెప్టెంబర్ 30 వరకు తమిళనాడులో, 29న దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో, 29న రాయలసీమలో, 29న కోస్తా కర్ణాటకలో, 30న లక్షద్వీప్ లో, 28 నుంచి అక్టోబర్ 2 వరకు కేరళ, మాహేలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
వాయు నాణ్యత..
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) డేటా ప్రకారం ఉదయం ఆదివారం 6:30 గంటల నాటికి గుజరాత్‌లోని నందేసరి 186 ఏక్యూఐతో అత్యల్ప వాయు నాణ్యతను నమోదు చేసింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన నగరాల్లో సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ ఉంది. గ్యాంగ్టక్ అతి తక్కువ కాలుష్య స్థాయిలు, ఉత్తమ గాలి నాణ్యతతో నిలిచింది. ఎందుకంటే ఇది 'మంచి' కేటగిరీలోకి వచ్చే ఏక్యూఐ 9ని నమోదు చేసింది.
ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్..
ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చాలా జిల్లాల్లో పొడి వాతావరణ ఉంటుందని పేర్కొంది. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణ మేఘావృతమే, చిరు జల్లులు పడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం