TGPSC Group 1 Mains 2024 : గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్... ఈనెల 14న మెయిన్స్‌ హాల్‌ టికెట్లు విడుదల, 21 నుంచి పరీక్షలు-tgpsc group 1 mains hall tickets will be available from october 14 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Group 1 Mains 2024 : గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్... ఈనెల 14న మెయిన్స్‌ హాల్‌ టికెట్లు విడుదల, 21 నుంచి పరీక్షలు

TGPSC Group 1 Mains 2024 : గ్రూప్ 1 అభ్యర్థులకు అలర్ట్... ఈనెల 14న మెయిన్స్‌ హాల్‌ టికెట్లు విడుదల, 21 నుంచి పరీక్షలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 09, 2024 04:11 PM IST

TGPSC Group 1 Mains Hall Tickets : తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈనెల 14వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. 21వ తేదీ నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

తెలంగాణ గ్రూప్ 1 హాల్ టికెట్లు
తెలంగాణ గ్రూప్ 1 హాల్ టికెట్లు

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది. అక్టోబర్ 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని తెలిపింది. 27వ తేదీతో ముగుస్తాయని వెల్లడించింది.

పరీక్షల సమయంలో అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేసింది.

గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ :

  • జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21, 2024.
  • పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22, 2024.
  • పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23, 2024.
  • పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24, 2024.
  • పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25, 2024.
  • పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26, 2024.
  • పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27, 2024.

గ్రూప్ 1 మెయిన్స్ కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్‌ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.

అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.00 వరకు నిర్వహిస్తారు.

మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్ లో మొత్తం 6 పేపర్లు ఉంటాయి.

Whats_app_banner