Fake RPF Police : ఏడాదిగా ఆర్ఫీఎఫ్ ఎస్ఐనంటూ బిల్డప్-పెళ్లిచూపులతో గుట్టురట్టు!
Fake RPF Police : ఏడాదిగా ఆర్పీఎస్ ఎస్ఐ అని చెప్పుకుంటున్న ఓ ఫేక్ మహిళా పోలీసు గుట్టురట్టైంది. ఫేక్ ఐడీ కార్డు, యూనిఫామ్ తో బంధువులు, గ్రామస్తులను మోసం చేసింది యువతి. చివరికే పెళ్లి సంబంధంతో ఆమె గుట్టురట్టైంది.
Fake RPF Police : ఏడాదిగా ఆర్పీఎఫ్ ఎస్ఐ(RPF SI)గా చెలామణి అవుతున్న నకిలీ పోలీసును నల్గొండ రైల్వే పోలీసులు(Railway Police) అరెస్టు చేశారు. ఈ నకిలీ పోలీసును విచారించిన పోలీసులు అవాక్కయ్యారు. ఏడాదిగా ఓ మహిళ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సబ్ ఇన్‌స్పెక్టర్‌గా వ్యవహరిస్తుంది. ఇటీవల మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ నకిలీ పోలీసును సత్కరించారు. నల్గొండ జిల్లాకు చెందిన జడల మాళవిక(25) ఆర్పీఎఫ్ లో ఎస్ఐగా పనిచేస్తున్నట్లు బంధువులు, గ్రామస్తులను నమ్మించింది. ఆర్‌పీఎఫ్ ఎస్ఐ యూనిఫాం ధరించి నల్గొండ, సికింద్రాబాద్ (Secunderabad)మధ్య ప్రయాణించే రైళ్లలో తరచూ ప్రయాణించేది. ఫేక్ ఐడీ కార్డును క్రియేట్ చేసుకుని ప్రయాణికులను తప్పుదోవ పట్టింటేది.
అసలేం జరిగింది?
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన మాళవిక అనే యువతి తాను ఆర్పీఎఫ్ ఎస్‌ఐ అని చెప్పుకుంటూ బంధువు, గ్రామస్తులను మోసం చేసింది. చివరికి పెళ్లి సంబంధానికి కూడా ఆమె పోలీస్ యూనిఫామ్‌లో వెళ్లింది. అయితే పెళ్లి సంబంధం కుదుర్చుకునే సమయంలో పెళ్లికొడుకు బంధువులు ఆరా తీయగా అసలు విషయం పడింది. మాళవిక ఫేక్ పోలీస్(Fake Police ) అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రులు బాధపడతారనే
మాళవిక హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ (RPF SI)పరీక్ష రాసింది. కంటి సమస్య కారణంగా ఆమె వైద్య పరీక్షల్లో క్వాలిఫై కాలేకపోయింది. అయితే ఫేక్ ఐడీ కార్డు(Fake ID Card), యూనిఫామ్ తో శంకర్ పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు మాళవిక అందరినీ నమ్మించింది. తనకు ఉద్యోగం రాలేదని తల్లిదండ్రులు బాధపడుతుండడంతో ఆమె ఇలా నకిలీ అధికారి అవతారం వేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్పీఎఫ్ యూనిఫామ్ ధరించి మాళవిక కొన్ని రీల్స్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రముఖులతో ఫొటోలు దిగి ఇన్ స్టాలో పోస్ట్
ఎల్బీనగర్ లో ఆర్ఫీఎఫ్ యూనిఫాం కొనుగోలు చేసిన మాళవిక రైల్వే ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఏడాది మోసాలకు పాల్పడుతుందని నల్గొండ రైల్వే ఎస్పీ సలీమా తెలిపారు. ప్రముఖులతో ఫొటోలు దిగి వాటిని ఇన్ గ్రామ్ లో పోస్టు చేసేది మాళవిక. పెళ్లిచూపులకు కూడా ఆర్ఫీఎఫ్ డ్రెస్ లో వెళ్లడంతో ఆమె గుట్టురట్టైంది. పెళ్లికొడుకు బంధువులు ఉన్నతాధికారులను ఆరా తీయగా... మాళవిక మోసాలు బయపడ్డాయి. ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు... అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.