Lord Shiva Temple : అడవి కింద శివయ్య.. ఈ విషయం చాలా మందికి తెలియదు
Adilabad Temple : ఆలయం అంటే.. వెళ్లగానే ఓ రకమైన ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. చూడగానే.. ఇది గుడి అనిపిస్తుంది. కానీ ఓ ప్రదేశంలో మాత్రం అందుకు భిన్నం. అసలు గుడి ఇక్కడ ఉందా అనిపిస్తుంది. సరిగా పరిశీలిస్తేనే గుడి ఉందని తెలుస్తుంది.
ఏదైనా ఆలయానికి(Temple) వెళితే ధ్వజస్తంభం, తలపైకి ఎత్తి చూసేలా గోపురం(Gopuram) కనిపిస్తుంది. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే స్థలం అగుపిస్తుంది. భక్తులు అక్కడే ఉంటూ.. దేవుడిని స్మరించుకుంటారు. కానీ ఓప్రాంతంలో మాత్రం అడవివి కింద గుడి ఉంది. అంటే శివయ్య ఆలయం.. భూగర్భంలో ఉంది. అందులోకి అందరూ వెళ్లేందుకు కూడా వీలు కాదు. కేవలం ముగ్గురు మాత్రమే వెళ్లొచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఆలయం ఉంది. కానీ పెద్దగా ఎవరికీ తెలియదు.
ఆదిలాబాద్(Adilabad) జిల్లా గుడిహత్నూర్ మండలం శాంతాపూర్‌కు నుంచి సుమారు రెండు కిలో మీటర్లు వెళ్లాలి. అంతా అటవీ ప్రాంతం. కానీ అక్కడ ఓ గుహ ఉంటుంది. అది కూడా భూమి లోపలకి ఉన్నట్టుగా ఉంటుంది. దీనికి పాతాళ నాగభైరవ(Pathala NagaBhairava) ఆలయం అని పిలుస్తారు. అయితే ఈ గుహలో గుడి ఉందనే విషయం మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. అక్కడి స్థానికులకు మాత్రమే తెలుసు. కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ గుడి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఏదో చూసేందుకు ప్రహారి గోడ కట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లేందుకు ఓ దారి ఉంటుంది.
ఒక్కసారిగా చూస్తే.. సాధారణ రాళ్ల కట్టడంలా కనిపిస్తుంది. కానీ లోపల శివుడున్నాడని చూస్తే కానీ అర్థం కాదు. పాతాళ నాగభైరవుడిగా ఈ ఆలయం ప్రసిద్ధి. శివరాత్రి(Shivaratri), శ్రీరామనవమి(Sri Ramanavami), దత్తాత్రేయ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ గుడిగి దగ్గరలోనే.. రామాలయం, దత్తాత్రేయ మందిరం, అమ్మవారి మందిరం కూడా ఉంటాయి. ఆలయం లోపలకి ఎక్కువ మంది వెళ్లేందుకు వీలుకాదు.
ముగ్గురు పూజరులు నిలబడి పూజ చేసేందుకు మాత్రమే సరిపోతుంది. లోపలికి వెళ్లాలంటే.. వంగి వెళ్లాలి. లోపల శివయ్య విగ్రహం ఉండటంతో పాతాళ నాగభైరవ అని పిలుస్తుంటారు. అక్కడి స్థానికులు రోజూ పూజ చేస్తారు. ఎప్పుడూ ఈ గుడిలో చల్లగా ఉంటుందని అంటున్నారు. చూసేందుకు మాత్రం.. పేర్చిన రాళ్లకట్టగా బంకర్‌లాగా అగుపిస్తుంది. లోపలికి వెళ్లేందుకు పది మెట్లు దిగాలి. త్రిశూలంతో నిలుచోని ఉన్న శివుడి విగ్రహం దర్శనమిస్తోంది.