K'taka govt asks temples: ఆ రోజు గోధూళి లగ్నంలో గో పూజ చేయండి
K'taka govt asks temples: పవిత్రమైన బలి పాడ్యమి రోజు గోపూజ నిర్వహించాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆలయాలను కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది.
K'taka govt asks temples: దీపావళి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 26న ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో గో పూజ నిర్వహించాలని కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది.
K'taka govt asks temples: బలి పాడ్యమి
ఈ సంవత్సరం బలి పాడ్యమి అక్టోబర్ 26న వస్తోంది. ఆ రోజన ఆవులను పూజిస్తారు. అందువల్ల సనాతన హిందూ ధర్మంలో భాగంగా ప్రకృతి పరిరక్షణ ఉద్దేశ్యంతో ఆ రోజు అన్ని ఆలయాల్లో గో పూజ చేయాలని ఆదేశిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
K'taka govt asks temples: గోధూళి లగ్నంలో..
అక్టోబర్ 26న బలి పాడ్యమి రోజుల సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల మధ్య గోధూళి లగ్నంలో ఈ పూజ నిర్వహించాలని వివరించింది. ఆ సమయంలో గోవులను శుభ్రంగా కడిగి, ఆలయాలకు తీసుకురావాలని, వాటికి గంధం, పసుపు పూసి, పూలతో అలంకరించాలని పేర్కొంది. అలాగే, వాటికి అన్నం, బెల్లం, అరటిపళ్లు, స్వీట్లు నైవేద్యంగా అందించాలని కోరింది. ఆ తరువాత దీపాలతో, అగరుబత్తీలతో పూజించాలని సూచించింది. హిందూ ధర్మంలో ఆవులకు పూజనీయ స్థానం ఉందని, తరతరాలుగా హిందువులు ఆవులను పూజిస్తున్నారని గుర్తు చేసింది.