Rock Paintings : వేటగాడు, ఎదురుగా పులి.. పన్నెండు మంది ఉండేలా గుహ-rock paintings found in mahabubnagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Rock Paintings Found In Mahabubnagar

Rock Paintings : వేటగాడు, ఎదురుగా పులి.. పన్నెండు మంది ఉండేలా గుహ

HT Telugu Desk HT Telugu
Oct 12, 2022 05:44 PM IST

Ancient Rock Paintings : మహబూబ్‌నగర్ జిల్లా నందిపేట్ గ్రామ సమీపంలో రాతి యుగపు చిత్రాలు బయటపడ్డాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కొంతమంది చరిత్ర ప్రియులు వీటిని కనుగొన్నారు.

గుహ
గుహ

మహబూబ్‌నగర్ జిల్లా నందిపేట్(Nandipet) గ్రామానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కొండపై, విల్లు ధరించిన వేటగాడి(Hunter)కి ఎదురుగా చిరుతపులి, పొడవాటి కొమ్ములతో ఉన్న జింక, పొడవాటి తోక ఉన్న జంతువు చిత్రాలు ఎరుపు రంగులో పెయింట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ పెయింటింగ్స్(Paintings) నుండి మీటర్ల దూరంలో ఒక గుహ కూడా కనిపించింది. మరొక ఎత్తైన బండరాయి పైన ఒక బండరాయితో ఏర్పడిన ఈ గుహలో పన్నెండు మంది వరకు ఉండగలరు. 'గుహ ఆదిమానవులు ఉపయోగించుకున్నారు. పెయింటింగ్‌లు కోకాపేట్ రాక్ పెయింటింగ్‌(Rock Paintings)ల మాదిరిగానే ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతంలో తొలి మానవుల ఉనికికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందజేస్తున్నాయి.' అని బృందానికి చెందిన వేమారెడ్డి హనుమంతు చెప్పారు.

ఈ రాతి చిత్రాలు చల్కోలిథిక్ కాలానికి చెందినవని రాక్ ఆర్ట్ నిపుణుడు బండి మురళీధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ చిరుతపులి పెయింటింగ్ దొరకడం చాలా అరుదు అని చెప్పారు. ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో షీల్డ్ పట్టుకుని నాలుగు కాళ్ల జంతువుపై స్వారీ చేస్తున్న బొమ్మను ఈ బృందం కనుగొంది.

ఇటీవల ఏపీలోనూ..

ఈ మధ్యకాలంలోనే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో 10 వేల ఏళ్ల నాటి రాతి చిత్రాలను ఏపీ పురావస్తు శాఖ కనిపెట్టింది. ఇలాంటివే గతంలో కర్నూలు, మధ్యప్రదేశ్‌లో కనిపించాయి. పురాతన, చారిత్రక భవనాలుస పురావస్తు అవశేషాల చట్టం, 1960 ప్రకారం వాటి రక్షణ కోసం చర్యలు తీసుకుంటామని.. పురావస్తు శాఖ అధికారి వాణీ మోహన్ చెప్పారు.

పురావస్తు శాఖ సహాయ సంచాలకులు వెంకటరావు మాట్లాడుతూ ఈ చిత్రాలను స్థానికుడు రమణమూర్తి చూసి అధికారులకు సమాచారం ఇచ్చారని చెప్పారు. 'మా బృందం శ్రీకాకుళం పట్టణానికి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగాంలోని కొండతెంబూరు గ్రామంలో అన్వేషణ చేసింది.' అని ఆయన చెప్పారు.

కొండల్లో వెతుకుతుంటే.. రాక్ షెల్టర్ల(Rock Shelters)లో పెయింటింగ్‌లను పురవాస్తుశాఖ కనుగొంది. నిశితంగా పరిశీలిస్తే పెయింటింగ్స్‌లో నెమలి, పంది, ఖడ్గమృగం, కోతి, మానవుడు, ఏనుగు, పిల్ల ఏనుగు, కుందేలు వంటి జంతువులు.. అంతేకాకుడా పక్షులు ఉన్నాయి.

పెయింటింగ్స్ అక్కడ ఎర్రటి ఓచర్‌తో గీశారని అధికారులు చెప్పారు. నెమలిని అందంగా చిత్రించారన్నారు. పెయింటింగ్స్, ఇక్కడ దొరికిన చిన్న చిన్న వస్తువులు చూస్తుంటే.. చాలా శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో మానవ ఉనికి ఉందని అర్థమవుతోందనిని పురావస్తు శాఖ సహాయ సంచాలకులు వెంకటరావు అన్నారు. జోగుల మెట్ట వద్ద ఉన్న ఆధారాలు చివరి ఎగువ ప్రాచీన శిలాయుగం.. 10000 సంవత్సరాలకు చెందినవి కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

IPL_Entry_Point

టాపిక్