Guttikonda Bilam : గుహలో 101 సొరంగాలు.. ప్రవహించే నది.. బ్రహ్మనాయుడి కత్తి-devshayani ekadashi 2022 special story of guttikonda bilam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guttikonda Bilam : గుహలో 101 సొరంగాలు.. ప్రవహించే నది.. బ్రహ్మనాయుడి కత్తి

Guttikonda Bilam : గుహలో 101 సొరంగాలు.. ప్రవహించే నది.. బ్రహ్మనాయుడి కత్తి

Anand Sai HT Telugu
Jul 10, 2022 03:58 PM IST

అక్కడకు వెళ్తుంటే.. ఏదో తెలియని అనుభూతి. లోపలికి వెళ్తుంటే.. ఆధ్యాత్మికత ఓ వైపు.. లోపలున్న రహస్యలేంటి అనే ప్రశ్నలు మరో వైపు. నీరు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. కానీ ఏ కాలమైనా.. ఉంటాయి. అదే గుత్తికొండ బిలం.

గుత్తికొండ బిలం
గుత్తికొండ బిలం

పల్నాడు జిల్లాలోని.. గుత్తికొండ బిలం లోపలికి వెళ్లాగనే.. ఎన్నో రహస్యాలు తనలో దాచుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అవేంటనేది మాత్రం అంత తేలికగా తెలియదు. ప్రసిద్ధక్షేత్రంగా.. పర్యాటక కేంద్రంగా ఉంది. పూర్వం ముచికుందుడనే మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని కథ ప్రాచుర్యంలో ఉంది. ఎంతో మంది ఋషులు ధాన్యం చేసుకునేవారని చెబుతుంటారు. .

వందల ఏళ్ల నుంచి ఇక్కడ పుణ్యక్షేత్రం ఉందని స్థానికులు చెబుతుంటారు. క్రీ.శ 1754వ సంవత్సరంలో స్వయంప్రకాశఅవధూత చీకటి మల్లయ్యగా పిలుస్తున్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రచారం ఉంది. పురాణకాలంలో మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకొనేవారట. పల్నాటి యుద్ధం తర్వాత బ్రహ్మనాయుడు చివరి రోజులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడిపాడని చెబుతుంటారు. బ్రహ్మనాయుడు ఉపయోగించిన కత్తి ఇక్కడ గుహలోని కోనేరులో దొరికింది. ప్రసత్తం హైదరాబాద్ పురావస్తుశాలలో ఉంది.

గుత్తికొండ బిలంలో 101 సొరంగాలు ఉంటాయి. ఒక్కొక్క సొరంగం ఒక్కొక్క జలకు దారితీస్తుంది. ఆ నీళ్లలో భక్తులు స్నానాలు చేస్తారు. ప్రతీ ఏటా తొలి ఏకాదశి నాడు వైభవోపేతంగా తిరునాళ్లు జరుగుతాయి. కార్తీకమాసంలో భక్తులు ఇక్కడకు తరలి వచ్చి, కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారు. ఇందులో గరళం సేవించే శివుడి విగ్రహం ఉందని, పల్నాడు యుద్ధం తర్వాత బ్రహ్మనాయుడు ఈ బిలంలోకి వెళ్లారని చెబుతుంటారు.

ఇక్కడ లోపల అనేక అంతర గుహలు, అద్భుత జలాశయాలు ఉన్నాయి. బిలంలో 101 సొరంగాలు ఉండగా… కానీ ఇప్పుడు మాత్రం వెళ్లేందుకు ఏడు గుహలు మాత్రమే ఉన్నాయి. బిలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. రుపాయి బిల్ల వేస్తే.. కనిపించేంత తేటగా నీళ్లు ఉంటాయి. ఈ బిలంలో మొదటిగా చీకటి మల్లయ్యస్వామిని దర్శించుకుని.. ఆ తరువాత బ్రహ్మనాయుడు బిలం, రేణుకా బిలం దగ్గరకు వెళ్లాలి. ఇక్కడి జలాలలో స్నానం చేస్తే.. కాశీలోని గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని ఓ నమ్మకం. అయితే ఈ జలాలు ఎక్కడ నుంచి వస్తాయో ఎవరికీ తెలియదు. లోపల ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది.. పూర్వం ఋషులు అక్కడే తప్పస్సు చేసుకునేవారని.. కాలక్రమేణా ముందుకు వచ్చిందని చెబుతారు. అందుకే కోనేరు దాటి లోపలకి వెళ్లడం కష్టం అంటున్నారు.

ఇక్కడ నుంచి అమరావతి, శ్రీశైలం, కాశీ, చేజర్ల, అహోబిలం, తిరుమల ఇలా రకరకాల ప్రాంతాలకు ఆధ్యాత్మిక ప్రాంతాలకు మార్గాలున్నాయని నమ్మకం ఉంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. నీరు చలికాలంలో వెచ్చగా, వేసవికాలంలో చల్లగా ఉంటుంది. వర్షాలతో వచ్చే నీరు కాదని.. లోపల నది నుంచి వస్తాయని స్థానికంగా ఉండే ఓ పూజారి చెప్పారు. వర్షాకాలం కంటే.. వేసవిలోనే.. నీరు కాస్త పైకి వస్తుంది అంటున్నారు. ఇక్కడ ఉన్న నూటొక్క సొరంగాలు రహస్యాలకు కేంద్రబిందువుగానే ఉంటుంది. ఈ బిలం ముఖద్వారం వద్ద బాలమల్లేశ్వర, రాజరాజేశ్వరి, వినాయక దేవాలయాలు ఉంటాయి.

హైదరాబాద్ లాంటి ప్రాంతం నుంచి వచ్చేవారు.. మాచెర్ల నుంచి, గుంటూరు నుంచి వచ్చేవారు నర్సరావుపేటలో బస్సు ఎక్కి గుత్తికొండకు రావాలి. అక్కడ అందుబాటులో ఆటో మాట్లాడుకొని వెళ్లొచ్చు. ఒకవేళ వాహనం లేకపోతే.. 5 కిలో మీటర్లు నడవాలి. ఆదివారాలు, సెలవు రోజులు, పర్వదినాలలో వెళ్తే.. పర్యాటకులు ఎక్కువగా వస్తార. రవాణా కూడా అందుబాటులో ఉంటుంది. ఈ గుత్తికొండ బిలం మాచర్ల - నర్సరావుపేట రహదారికి ద్గగరలో ఉంది. మాచర్లకు 65 కిలో మీటర్లు, కారంపూడికి 30 కిలో మీటర్లు, నర్సరావు పేటకు 30 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. కారంపూడి గ్రామానికి దగ్గరలో అడవి ప్రాంతంలో ఉంది

IPL_Entry_Point