Yadadri Temple : యాదాద్రి ఆలయానికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అవార్డు-yadadri temple win green place of worship award ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadadri Temple : యాదాద్రి ఆలయానికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అవార్డు

Yadadri Temple : యాదాద్రి ఆలయానికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అవార్డు

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 09:26 PM IST

యాదాద్రి ఆలయానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రదానం చేసే గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అవార్డు దక్కింది.

<p>యాదాద్రి ఆలయానికి అవార్డు,</p>
యాదాద్రి ఆలయానికి అవార్డు, (ytda)

yadadri temple gets green place of worship award: యాదాద్రి ఆలయానికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రదానం చేసే గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు దక్కింది. 2022 – 2025 సంవత్సరాలకు గాను ఈ అవార్డు వచ్చింది. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ప్రభుత్వం ఆధునీకరణ పనులు చేపట్టడాన్ని ప్రశంసించింది.

ఆలయ పరిసరాల్లో కొండలను కాపాడటం,మంచినీటి సరఫరా, వెంటిలేషన్, ఏసీల ఏర్పాటు, 40 శాతం పచ్చదనం, పార్కింగ్ స్థలాల ఏర్పాటు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

ఆధునీకరణ తర్వాత యాదాద్రి పున:దర్శనం మార్చి 28వ తేదీన ప్రారంభమైంది. మహా కుంభ సంప్రోక్షణ ఘట్టం తర్వాత భక్తులకు దర్శనం కల్పించారు. యాదాద్రి ఆలయం పున:నిర్మాణ పనులు దాదాపు ఆరేండ్లు సాగాయి. నారసింహుడు కొలువైన గర్భాలయాన్ని రెండున్నర లక్షల టన్నుల కృష్ణశిలలతో నిర్మించారు. ఇందుకు 1,200 మంది శిల్పులు పనిచేశారు. 1,700 అడుగుల పొడవునా.. 80 నుంచి 100 అడుగుల ఎత్తుతో ప్రాకారాలను నిర్మించారు.

84 అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తుల మహారాజగోపురం.. ఐదు, నాలుగు, మూడు, రెండు అంతస్తులతో మరో ఐదు గోపురాలను నిర్మించారు. ప్రాకారానికి బయట అష్టభుజ మండపాల్లో భక్తులు సేదదీరవచ్చు. కొండమీద విష్ణు పుష్కరిణి, కొండ కింద భక్తుల కోసం లక్ష్మీ పుష్కరిణి ఏర్పాటు అయ్యాయి.

Whats_app_banner