Yadadri Temple | యాదాద్రి పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పులు
యాదాద్రి పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పులు చేశారు. రూ.100 అదనపు రుసుం ఎత్తివేసినట్లు అధికారుల వెల్లడించారు.
యాదాద్రి ఆలయం దగ్గర పార్కింగ్ ఫీజుల విషయంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసింతే. అయితే తాజాగా పార్కింగ్ ఫీజుల విషయంలో రూ.100 ఎత్తివేసినట్టుగా అధికారులు చెప్పారు. 4 చక్రాల వాహనాల పార్కింగ్ ఫీజు రూ.500 యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించారు.
కొండపైకి వాహనాలను అనుమతించాలని ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం ఫీజును వసూలు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. వెహికల్ పార్కింగ్ చేసిన గంటకు రూ. 500 రూపాయలుగా పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రతి గంటకు రూ.100 చొప్పున వసూలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లే వెల్లడించారు. ప్రొటోకాల్, దాతల వాహనాలకు మాత్రం ప్రవేశం రుసుం మినహాయింపు ఉంటుందని వివరించారు. అయితే అదనంగా వసూలు చేసే గంటకు వంద రూపాయలను ఎత్తివేసినట్టుగా అధికారులు తెలిపారు.
ఆలయ పునఃప్రారంభం రోజు నుంచే వాహనాలను కొండపైకి అనుమతి ఇవ్వటం లేదు. కొండ కింద నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. ఇందులోనే భక్తులు కొండపైకి చేరుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అధికారుల నిర్ణయంపై ఆలయ ప్రారంభం రోజు నుంచే భక్తులు ఆందోళనకు దిగారు. కొండపైకి వాహనాలను అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయ అధికారులు వాహనాలకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఛార్జీలపై భక్తులు పెదవి విరుస్తున్నారు.
మరోవైపు ప్రముఖ దివ్యక్షేత్రం యాదగిరిగుట్టకు హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా 100 మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉప్పల్ సర్కిల్ నుంచి యాదాద్రి మధ్య రవాణా సర్వీసులను ఏర్పాటు చేశారు. జేబీఎస్ నుంచి యాదగిరిగుట్టకు రూ.100 ... ఉప్పల్ నుంచి అయితే రూ. 75 గా నిర్ణయించారు.
టాపిక్