Supreme Court serious on hate speeches: ‘‘దేవుడిని ఏ స్థాయికి తగ్గించాం!’’-what have we reduced god to supreme court orders action against hate speech ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  'What Have We Reduced God To': Supreme Court Orders Action Against Hate Speech

Supreme Court serious on hate speeches: ‘‘దేవుడిని ఏ స్థాయికి తగ్గించాం!’’

HT Telugu Desk HT Telugu
Oct 21, 2022 07:59 PM IST

Supreme Court serious on hate speech: దేశంలో కొనసాగుతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏమతానికి చెందిన వారైనా.. విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది.

సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు

Supreme Court on hate speeches: ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల ముస్లింలపై విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన వారిపై చర్యలకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా Supreme Court కీలక వ్యాఖ్యలు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Supreme Court on hate speeches: ఏ మతం వారైనా..

విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తూ, ప్రజలను రెచ్చగొడ్తన్న వారు.. ఏ మతం వారైనా వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశించింది. వారిపై సు మొటొ గా కేసులు నమోదు చేయాలని ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ పోలీస్ బాస్ లకు ఆదేశాలు జారీ చేసింది. , తమ ఆదేశాలను అమలు చేయనట్లైతే కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ ధర్మాసనం హెచ్చరించింది.

Supreme Court on hate speech: 21వ శతాబ్ధంలోనూ..

కేవలం ముస్లింలకు వ్యతిరేకంగానే కాదు.. హిందువులకు వ్యతిరేకంగా కూడా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలా విద్వేష పూరిత ప్రసంగాలు చేేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాని సూచించింది. ‘‘ఇది 21 వ శతాబ్దం. ఈ 21వ శతాబ్దంలో దేవుడిని ఏ స్థాయికి తగ్గించాం మనం? శాస్త్రీయ దృక్పథం ఉండాలని ఆర్టికల్ 51 చెబుతోంది. కానీ, సమాజంలో మతం, దేవుడు పేరుతో ఏం జరుగుతోంది?. ఇది చాలా విషాదకరం’’ అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది.

Supreme Court on hate speech: విద్వేష వాతావరణం

ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల ముస్లింలపై విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన వారిపై చర్యలకు ఆదేశించాలని కోరుతూ జర్నలిస్ట్ షాహీన్ అబ్దుల్లా దాఖలు చేసిన పిల్ పై విచారణ సందర్భంగా Supreme Court ఈ వ్యాఖ్యలు చేసింది. సమాజంలో విద్వేష వాతావరణం నెలకొన్నదని, ఈ పరిస్థితి మారాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ పాలన, ప్రాథమిక హక్కుల రక్షణ కోర్టుల బాధ్యత కూడానని పేర్కొంది.

IPL_Entry_Point