MLC Kavitha Arrest : కవిత అరెస్ట్... హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్, రోజంతా అసలేం జరిగింది..?-ed arrested kcr daughter kavitha in connection with delhi liquor scam case full details of what happened yesterday ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ed Arrested Kcr Daughter Kavitha In Connection With Delhi Liquor Scam Case Full Details Of What Happened Yesterday

MLC Kavitha Arrest : కవిత అరెస్ట్... హైదరాబాద్ నుంచి ఢిల్లీకి షిఫ్ట్, రోజంతా అసలేం జరిగింది..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 16, 2024 05:30 AM IST

MLC Kavitha Arrest in Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రంగంలోకి దిగిన ఈడీ బృందం… అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్

ED Arrested KCR DaughterK Kavitha: గత రెండేళ్లుగా ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Scam Case) చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ, ఈడీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. ఓవైపు నిందితులు అఫ్రూవర్లుగా మారుతుండగా.. కీలక సమాచారాన్ని రాబడుతున్నాయి దర్యాప్తు సంస్థలు. ఆ సమాచారంతోనే స్పీడ్ ను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే.... ఈ కేసులో పాత్రదారిగా చెబుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్(MLC Kavitha Arrest) చేసింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. దీంతో కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు అయింది. శుక్రవారం హైదరాబాద్ నుంచి చేరుకున్న ఈడీ బృందం... సాయంత్రం అరెస్ట్ చేసి రాత్రి సమయానికి ఢిల్లీకి తరలించింది. అసలు నిన్నంతా(మార్చి 15,2024) ఏం జరిగిందనేది చూస్తే....

ఢిల్లీ లిక్కర్ కేసు - కవిత ఇంటి వద్ద ఏం జరిగింది…?

  • ఢిల్లీ లిక్కర్ కేసు(Delhi Liquor Scam Case) వ్యవహారం 2022లో వెలుగులోకి వచ్చింది.
  • -2021లో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ(Delhi Liquor Scam Case)లో అవకతవకలు జరిగాయని.. దీనిపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
  • -ఈ కేసును మొదటగా సీబీఐ విచారణ జరపగా… ఆ తర్వాత ఈడీ ఎంట్రీ ఇచ్చింది. 
  • ఈ కేసులో 2002లో అమిత్ ఆరోరోనా అరెస్ట్ చేసింది సీబీఐ. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తొలిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఫోన్ల ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని పేర్కొంది.
  • ఈ కేసుకు సంబంధిచి నోటీసులు అందుకున్నారు కవిత. 2022 డిసెంబర్ లో హైదరాబాద్ లో ని కవిత నివాసానికి  సీబీఐ అధికారుల బృందం వచ్చింది… కవితను దాదాపు 7 గంటలపాటు కవితను విచారించారు.
  • ఆ తర్వాత ఈడీ(ED) నుంచి కూడా నోటీసులు వచ్చాయి. స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు(2023 మార్చి 11) కూడా హాజరయ్యారు కవిత. ఈ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అరెస్ట్ కాలేదు.
  • 2023లో మహిళల విచారణలో ఈడీ సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కొద్ది నెలలుగా విచారణ జరుగుతోంది. 
  • కేసు విచారణ సాగుతుండగానే… మరోవైపు సీబీఐ, ఈడీ మరోసారి కవితకు నోటీసులు పంపాయి. ఈ కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా కూడా పేర్కొంది సీబీఐ. ఇటీవలే 41 సీఆర్పీసీ కింద నోటీసులు కూడా ఇచ్చింది. కానీ సీబీఐ విచారణకు హాజరుకాలేదు కవిత.
  • కవిత పిటిషన్ పై మార్చి 15వ తేదీన విచారణ జరిగింది. అయితే తదుపరి విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
  • మార్చి 15వ తేదీన 12 మందితో కూడా ఈడీ అధికారుల బృందం హైదరాబాద్ కు చేరుకుంది. 
  • శుక్రవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ బంజారాహిల్స్ ని కవిత నివాసానికి చేరుకుంది.
  • కవిత నివాసంలో సోదాలు చేపట్టింది.  మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సోదాలు జరిగినట్లు ఈడీ ఓ ప్రకటన విడుదల చేసింది.
  • కవిత నివాసానికి ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ చేరుకున్నారు. వారితో పాటు అడ్వొకేట్ సోమ భరత్ కూడా ఉన్నారు.
  • తొలుత వీరిని ఇంట్లోకి వెళ్లేందుకు ఈడీ అధికారులు అనుమతించలేదు. ఆ తర్వాత లోపలికి వెళ్లినట్లు తెలిసింది. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ అధికారులను కేటీఆర్ ప్రశ్నించారు. 
  • శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు కవితను అరెస్ట్‌ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
  • PMLA(Prevention of Money Laundering Act) యాక్ట్‌ సెక్షన్‌ 19 కింద అరెస్ట్‌ చేసినట్లు ఈడీ తెలిపింది.
  • సాయంత్రం 6 గంటలకు 20 మంది అనుమతి లేకుండా లోపలికి వచ్చి తమతో వాగ్వాదానికి దిగారని ఈడీ పేర్కొంది.
  • ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుతో కవిత అరెస్ట్ కు సంబంధించి ప్రకటన విడుదలైంది.
  • అరెస్ట్‌ చేయడానికి గల కారణాలతో కూడిన 14 పేజీల కాపీని కవితకు అందజేసినట్లు ఈడీ తెలిపింది.
  • ఆ తర్వాత కవితను తరలిచేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే బీఆర్ఎస్  శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా… పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు.
  • కవితను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేర్చేందుకు పోలీసులు రూట్ క్లియర్ చేశారు. కవిత సొంత కారులోనే ఎయిర్ పోర్టుకు బయల్దేరారు.
  •  రాత్రి 8 గంటల తర్వాత శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు కవిత.
  • రాత్రి 08.45 నిమిషాలకు ఈడీ బుక్ చేసిన ఫైట్ లో ఢిల్లీకి తరలించారు.
  • ఇవాళ ఢిల్లీలోని రౌజ్ రెవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టనుంది ఈడీ.
  • కవితను ఢిల్లీకి తరలించిన నేపథ్యంలో… కేటీఆర్ తో పాటు పలువురు నేతలు శుక్రవారం రాత్రే ఢిల్లీకి బయల్దేరారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.

IPL_Entry_Point