MLC Kavith Arrest Live Updates : లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ - ఢిల్లీకి తరలించిన ఈడీ, నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్
- MLC Kavith Arrest in Delhi liquor scam Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ నివాసం నుంచి ఢిల్లీకి తరలించింది. ఈడీ అధికారులకు పలు ప్రశ్నలు సంధిస్తూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Fri, 15 Mar 202404:30 PM IST
కేటీఆర్ పై కేసు
తమ విధులకు ఆటంకం కలిగిస్తూ… ప్రశ్నించినందుకు గాను కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది ఈడీ. బంజారాహిల్స్ లో కేసు నమోదైంది.
Fri, 15 Mar 202403:48 PM IST
రేపు బీార్ఎస్ నిరసనలు
ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది భారత రాష్ట్ర సమితి.
Fri, 15 Mar 202403:40 PM IST
ఢిల్లీకి చేరుకోనున్న కవిత
ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు కవిత. ఈడీ ఆఫీస్ లోనే బస చేయనున్నారు. రేపు కోర్టులో హాజరుపరుస్తారు.
Fri, 15 Mar 202403:30 PM IST
బీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో
కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.
Fri, 15 Mar 202403:21 PM IST
14 పేజీల ఈడీ మెమో…
కవిత అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీల మెమో ఇచ్చింది ఈడీ. కవితతో పాటు ఆమె భర్త అనిల్‌కు కూడా సమాచారం ఇచ్చామని, మనీలాండరింగ్ చట్టం సెక్షన్ 3 కింద కవిత నేరానికి పాల్పడ్డారని ఈడీ ప్రకటించింది.
Fri, 15 Mar 202403:04 PM IST
ఇవాళ రాత్రికి ఈడీ ఆఫీసులోనే
ఇవాళ రాత్రి ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు. రేపు రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు.
Fri, 15 Mar 202403:01 PM IST
సుప్రీంలో పిటిషన్ వేస్తాం - హరీశ్ రావు
కవిత అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేత హరీశ్ రావు. బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను డీమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేశాయని ఆరోపించారు.. కేసులు, అరెస్ట్‌లు తమకు కొత్త కాదని.. రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. కవిత అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ప్రకటించారు.
Fri, 15 Mar 202402:58 PM IST
అభివాదం చేసిన కవిత
అభివాదం చేస్తూ ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లారు కవిత. కాసేపట్లో ఢిల్లీకి పయనం అవుతారు. రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
Fri, 15 Mar 202402:46 PM IST
ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవిత
కవిత శంషాబాద్ చేరుకున్నారు. 08.40 నిమిషాలకు ఢిల్లీకి ఫ్లైట్ లో బయల్దేరనున్నారు.
Fri, 15 Mar 202402:36 PM IST
తెలంగాణ బంద్ కు పిలుపు
కవిత అరెస్ట్ కు నిరసనగా రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ మేరకు హరీశ్ రావు ప్రకటన చేశారు.
Fri, 15 Mar 202402:30 PM IST
కాసేపట్లో ఢిల్లీకి పయనం
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు కవిత. కాసేపట్లో ఢిల్లీకి పయనం కానున్నారు.
Fri, 15 Mar 202402:18 PM IST
రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ
రేపు మధ్యాహ్నం రౌస్ రెవెన్యూ కోర్టులో కవితను హాజరపర్చనుంది ఈడీ
Fri, 15 Mar 202402:10 PM IST
ఈడీ కస్టడీ పిటిషన్….!
విచారణ కోసం కవితను కస్టడీ కోరేందుకు సిద్ధమైంది ఈడీ. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
Fri, 15 Mar 202402:08 PM IST
సాయంత్రం అరెస్ట్ - ఈడీ ప్రకటన
కవితను సాయంత్రం 05.20 గంటలకు కవితను అరెస్ట్ చేసినట్లీ ఈడీ తెలిపింది. కవిత భర్త అనిల్ కు పూర్తి సమాచారం ఇచ్చామని పేర్కొంది.
Fri, 15 Mar 202402:07 PM IST
ఈడీ ప్రకటన
మనీ లాండరింగ్ హవాలా చట్టం కింద కవితను అరెస్ట్ చేసినట్లు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది.
Fri, 15 Mar 202402:00 PM IST
కాసేపట్లోనే ఎయిర్ పోర్టుకు
కవితను తరలిస్తున్న వాహనం పీవీ ఎక్స్ ప్రెస్ హైవే వరకు చేరింది. కాసేపట్లోనే విమానాశ్రయానికి చేరుకోనుంది. ఆ తర్వాత ఢిల్లీకి తరలిస్తారు.
Fri, 15 Mar 202401:53 PM IST
కేటీఆర్ ప్రెస్ మీట్
రాత్రి 8 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.
Fri, 15 Mar 202401:53 PM IST
అడ్డంకులు లేకుండా రూట్ క్లియర్
కవితను తరలిస్తున్న కాన్వాయ్ ముందుకెళ్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు రూట్ ను క్లియర్ చేస్తున్నారు.
Fri, 15 Mar 202401:49 PM IST
ఢిల్లీకి కవిత
లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసిన ఈడీ…. కాసేపట్లో ఢిల్లీకి తరలించనుంది.
Fri, 15 Mar 202401:46 PM IST
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ దృశ్యాలు….
Fri, 15 Mar 202401:45 PM IST
కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కవిత
కవితను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలిస్తున్నారు. అక్కడ్నుంచి ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు.
Fri, 15 Mar 202401:40 PM IST
రూట్ క్లియర్ చేస్తున్న పోలీసులు
కవితను ఎయిర్ పోర్టుకు తరలించేందుకు రెండు మార్గాల్లో రూట్ ను క్లియర్ చేశారు.
Fri, 15 Mar 202401:38 PM IST
ఉద్రిక్తత పరిస్థితి
కవితను తరలిస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారు. వారిని పోలీసులు చెదరగొడుతున్నారు.
Fri, 15 Mar 202401:38 PM IST
కవిత వాహనంలోనే
ఈడీ అధికారుల వాహనంలో కాకుండా కవిత వాహనంలోనే విమానాశ్రయానికి తరలిస్తున్నారు.
Fri, 15 Mar 202401:37 PM IST
కవితను తీసుకెళ్తున్న ఈడీ
కవితను ఈడీ అధికారులు విమానాశ్రయానికి తీసుకెళ్తున్నారు.
Fri, 15 Mar 202401:35 PM IST
పోలీసుల రూట్ క్లియర్
కవితను తీసుకెళ్లే మార్గంలో పోలీసులు రూట్ క్లియర్ చేశారు. కాసేపట్లో విమానాశ్రయం చేరుకునే అవకాశం ఉంది.
Fri, 15 Mar 202401:34 PM IST
కవిత అరెస్ట్ పై ఈడీ సమాచారం
Fri, 15 Mar 202401:34 PM IST
కవిత అరెస్ట్ పై ఈడీ ప్రకటన
Fri, 15 Mar 202401:31 PM IST
అరెస్ట్ పై ఈడీ ప్రకటన
కవిత అరెస్ట్ కు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది ఈడీ.
Fri, 15 Mar 202401:28 PM IST
ఇంట్లో నుంచి బయటికి కవిత
ఇంట్లో నుంచి కవితను బయటికి తీసుకొచ్చారు. ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు.
Fri, 15 Mar 202401:22 PM IST
రాత్రి 8.45కి ఫ్లైట్ బుక్
రాత్రి 8.45కి ఫ్లైట్ బుక్ చేసింది ఈడీ. ఎమ్మెల్సీ కవితను ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.
Fri, 15 Mar 202401:11 PM IST
కవిత పిటిషన్ పై విచారణ వాయిదా…
కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. మార్చి 19వ తేదీకి విచారణకు వాయిదా వేసింది.
Fri, 15 Mar 202401:11 PM IST
ఈడీ దూకుడు…..
ఈ కేసులో తీర్పును బట్టి ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi excise policy irregularities) కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి నిందితులుగా ఉన్న మాగుంట రాఘవ, ఆరుణ్ పిళ్లైతో పాటు కవిత పీఏ అశోక్ అఫ్రూవర్లుగా మారటంతో దర్యాప్తు సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. వారు ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసులో దూకుడు పెంచినట్లు సమాచారం.
Fri, 15 Mar 202401:11 PM IST
సుప్రీంలో కవిత పిటిషన్
లిక్కర్ కేసులో తన పేరును ప్రస్తావించటంతో పాటు మహిళలను విచారించే పద్ధతిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసుపై గత కొంతకాలంగా విచారణ జరుగుతోంది. తుది తీర్పు వచ్చే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు తీర్పునిచ్చింది.
Fri, 15 Mar 202401:10 PM IST
రెండేళ్లుగా విచారణ
ఈ కేసుకు సంబంధించి గత రెండేళ్లుగా కవితపై అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సౌత్ గ్రూపునకు సంబంధించి కీలక విషయాల్లో కవిత ఉన్నారనే అభియోగాలు ఉన్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా పలుమార్లు సీబీఐ, ఈడీ నుంచి నోటీసులు కూడా అందుకున్నారు కవిత. రెండు సార్లు సీబీఐ అధికారులు... హైదరాబాద్ కవిత నివాసంలో విచారణ కూడా జరిపారు. ఇదే క్రమంలో గతేడాది మార్చిలో ఢిల్లీలోని ఈడీ(Enforcement Directorate) ఆఫీస్ లో జరిగిన విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఆ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ కవిత అరెస్ట్ కాలేదు.
Fri, 15 Mar 202401:08 PM IST
కేటీఆర్ ఆగ్రహం
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Fri, 15 Mar 202401:05 PM IST
ఈడీ అధికారులతో వాగ్వాదం
కవిత తరపున న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవటం పట్ల కేటీఆర్, హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
Fri, 15 Mar 202401:04 PM IST
రాత్రికి ఢిల్లీకి తరలింపు…?
మరోవైపు కవితను ఢిల్లీకి తరలించేందుకు ఈడీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్లైట్ టికెట్లను బుకింగ్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఇవాళ రాత్రి 08.45 నిమిషాలకు విమానంలో ఢిల్లీకి తరలించనున్నట్లు తెలుస్తోంది.
Fri, 15 Mar 202401:04 PM IST
మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
మరోవైపు కవిత తరపు అడ్వొకేట్ సోమ భరత్ ను కూడా లోపలికి అనుమతించలేదు. ఈడీ తీరును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వేళ కేసీఆర్ ను దెబ్బతీసేందుకే ఈ తరహా అరెస్టుకు దిగారని ఆరోపిస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
Fri, 15 Mar 202401:04 PM IST
కవిత నివాసానికి కేటీఆర్, హరీశ్
మరోవైపు కవిత అరెస్ట్ వార్తల నేపథ్యంలో…. సమాచారం అందుకున్న కేటీఆర్, హరీశ్ రావు… వెంటనే కవిత నివాసానికి చేరుకున్నారు. అయితే కవిత ఇంటి గేట్లను మూసివేయించిన అధికారులు… ఎవరిన్ని కూడా లోపలికి అనుమతించలేదు.
Fri, 15 Mar 202401:03 PM IST
ఫోన్లో సీజ్
లిక్కర్ కేసులో సోదాల్లో భాగంగా కవిత ఫోన్లను స్వాధీనం చేసుకుంది ఈడీ. ఇవాళ రాత్రికి ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. మరోవైపు కవిత నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Fri, 15 Mar 202401:01 PM IST
ఈడీ అదుపులో కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) నివాసంలో ఈడీ సోదాలు సంచలనంగా మారాయి. లిక్కర్ కేసులో(Delhi liquor Scam) ఈడీతో పాటు ఐటీ అధికారులు ఇవాళ మధ్యాహ్నం తర్వాత తనిఖీలు చేపట్టాయి. తనిఖీల తర్వాత కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది.