TSPSC DAO Exams: డిఏఓ, వార్డెన్ ఉద్యోగాల పరీక్షా తేదీల ఖరారు, జూన్ 24న వార్డెన్, 30న డిఏఓ పరీక్షలు
TSPSC DAO Exams: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్, వార్డెన్ ఉద్యోగాల పరీక్ష తేదీలను కమిషన్ ప్రకటించింది.
TSPSC DAO Exams: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC ఆధ్వర్యంలో ప్రకటించిన పలు ఉద్యోగ పరీక్షల తేదీలను ప్రకటించారు. డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులతో పాటు వార్డెన్ Warden Grade 1 ఉద్యోగాలకు సంబంధించిన తేదీలను Exam Dates ఖరారు చేశారు.
డిఏఓ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష టిఎస్‌పిఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో రద్దైంది. దీంతో ఈ పరీక్షను మరోమారు నిర్వహిస్తామని కమిషన్ గతంలో ప్రకటించింది.
టిఎస్‌పిఎస్సీ డివిజనల్ అకౌంట్స్ అధికారి DAO Grade 1 (డీఏఓ)-గ్రేడ్ 2పోస్టులకు వచ్చే జూన్ 30న నిర్వహించనున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. వార్డెన్ పోస్టులకు జూన్ 24 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.
తెలంగాణ వర్క్స్ అకౌంట్స్ శాఖలో 53 డీఏఓ పోస్టుల భర్తీకి 2022 ఆగస్టు 4న నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 అర్థమెటిక్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, ఎస్సీ, బీసీ, మహిళా-శిశు సంక్షేమ శాఖల్లో 581 'హాస్టల్ వెల్ఫేర్ అధి కారి(వార్డెన్)- గ్రేడ్ 1, 2 కేటగిరీల పోస్టుల భర్తీకి 2022 డిసెంబరు 23న నోటిఫికేషన్ జారీ చేశారు.
వార్డెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి నవారికి వచ్చే జూన్ 24 నుంచి పరీక్షలు ప్రారంభిస్తామని, ఏ రోజు ఏ పోస్టుకు పరీక్ష ఉంటుందనే వివరాలను త్వరలో ప్రకటిస్తామని కమిషన్ కార్య దర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి హాల్ టిక్కెట్లను పరీక్ష తేదీలకు వారం ముందు కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.
దాదాపు ఏడాదిన్నర కాలంగా పరీక్షల నిర్వహణ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు అందిస్తూ టిఎస్‌పిఎస్సీ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించింది. పరీక్షల నిర్వహణకు మరో మూడు నెలల ముందే తేదీలను ఖరారు చేయడంతో అభ్యర్థులకు తగినంత ప్రిపరేషన్ సమయం దొరకనుంది.
టిఎస్‌పిఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గత రెండేళ్లలో కమిషన్ విడుదల చేసిన పలు పరీక్షలు రద్దయ్యాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పాత నోటిఫికేషన్లకు అనుగుణంగా పరీక్ష తేదీలను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్1 పాత నోటిఫికేషన్ రద్దు చేసి అనుబంధ పోస్టులతో కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.
సంబంధిత కథనం