Preity Zinta : పంజాబ్ జట్టు కోసం 120 పరోటాలు చేసిన ప్రీతి జింటా, ఎవరు ఎక్కువ తిన్నారు?-ipl 2023 priety zinta reveals she once made 120 aloo parathas for punjab kings player ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Preity Zinta : పంజాబ్ జట్టు కోసం 120 పరోటాలు చేసిన ప్రీతి జింటా, ఎవరు ఎక్కువ తిన్నారు?

Preity Zinta : పంజాబ్ జట్టు కోసం 120 పరోటాలు చేసిన ప్రీతి జింటా, ఎవరు ఎక్కువ తిన్నారు?

Anand Sai HT Telugu
Apr 30, 2023 08:34 AM IST

Punjab Kings Team : చాలా ఏళ్ల క్రితం తాను పంజాబ్ జట్టు ఆటగాళ్లకు 120 పరోటాలు చేశానని ప్రీతి జింటా చెప్పింది. అయితే ఎవరు ఎక్కువగా తిన్నారనే విషయం కూడా హింట్ ఇచ్చింది.

ప్రీతి జింటా
ప్రీతి జింటా ( CricketGully)

IPL 2023 జరుగుతోంది, కొన్ని జట్లు బాగా రాణిస్తున్నాయి. కొన్ని జట్లు పేలవంగా రాణిస్తున్నాయి. కొన్ని జట్లు ఇబ్బంది పడుతున్నాయి. అందులో పంజాబ్ కూడా ఒకటి. RCB లాగా , పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు కప్ గెలవలేదు. ఈ జట్టు యజమాని ప్రీతి జింటా(Priety Zinta) జట్టుకు మద్దతుగా వచ్చిన ప్రతిసారీ నిరాశ చెందుతుంది. అయినా జట్టుపై నమ్మకం కోల్పోలేదు. అంతేకాదు జట్టు రాణించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. అయితే ఓ ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే ఒకానొక సమయంలో ప్రీతి జింటా స్వయంగా టీమ్ కోసం పరోటాలు చేసిందట.

2009లో లోక్‌సభ ఎన్నికల కారణంగా దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ మ్యాచ్‌లు(IPL Matches) జరిగాయి. IPL జట్టు సభ్యులు, కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బంది దక్షిణాఫ్రికాలో ఉండవలసి వచ్చింది. చాలా మంది సభ్యులు ఆహార సమస్యలను ఎదుర్కొన్నారు. భారతీయ ఆహారం అందుబాటులో లేదు. ముంబయి, RCB, మరికొన్ని ఇతర జట్లు వారి స్వంత చెఫ్‌లను తీసుకున్నాయి. కొన్ని జట్లు ఆ సాహసం చేయలేదు.

పంజాబ్ జట్టు(Punjab Team) సభ్యులు భారతీయ ఆహారం దొరక్క ఇబ్బంది పడ్డారు. ఒకసారి తమకు లభించిన బంగాళదుంప పరోటాలు అస్సలు బాగోలేదని టీమ్ సభ్యులు కొందరు ప్రీతి జింటా(Priety Zinta)కు ఫిర్యాదు చేశారు. సరే, నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే, ఆలూ పరోటాలు చేసి సర్వ్ చేస్తాను అని ప్రీతి చెప్పింది. తర్వాత మ్యాచ్‌లో పంజాబ్ టీమ్ గెలిచింది. ఇచ్చిన మాట ప్రకారం తాను 120 ఆలూ పరోటాలు తయారు చేశానని ప్రీతి జింటా తెలిపింది. అంతేకాదు అథ్లెట్లు ఎంత తిండి తిన్నారో తెలుసుకుని జట్టు సభ్యులు తినే విధానం చూసి షాక్ అయిందట.

ఈ విషయాన్ని ప్రీతీ జింటా వివరించగా.. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. ఆ 120లో 20 పరోటాలను ఇర్ఫాన్ పఠాన్ ఒక్కడే ఖాళీ చేశాడని చమత్కరించాడు. ప్రీతి కూడా నవ్వి అవును అని తల ఊపింది.

2009 ఐపీఎల్‌లో పంజాబ్ ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ టోర్నీలో ఆర్‌సీబీ(RCB) సెమీ ఫైనల్‌లో చెన్నైని ఓడించి తొలిసారి ఫైనల్‌లోకి ప్రవేశించింది. కానీ రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు IPL 2023 పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ ఆరో స్థానంలో ఉండగా, RCB ఐదో స్థానంలో ఉంది.

Whats_app_banner