Rashid Khan Ipl Records: ఐపీఎల్‌లో అరుదైన ఘనతను సాధించిన రషీద్‌ఖాన్ - మైల్‌స్టోన్ మ్యాచ్‌లో చెత్త రికార్డ్
Rashid Khan Ipl Records: శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్ ద్వారా గుజరాత్ స్పిన్సర్ రషీద్‌ఖాన్ ఐపీఎల్‌లో కొత్త రికార్డ్‌ను నెలకొల్పాడు. ఆ రికార్డ్ ఏదంటే...
Rashid Khan Ipl Records: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ కొత్త రికార్డ్‌ను నెలకొల్పాడు. శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతోన్న మ్యాచ్ ద్వారా వంద మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్నాడు. కానీ అరుదైన మ్యాచ్‌లో అతడికి చేదు అనుభవం ఎదురైంది. నాలుగు ఓవర్లు వేసిన రషీద్‌ఖాన్ ఒక్క వికెట్ కూడా తీయకుండా 54 రన్స్ ఇచ్చాడు. అతడి ఐపీఎల్ కెరీర్‌లో బౌలింగ్ పరంగా అత్యధిక పరుగులు ఇచ్చిన మ్యాచ్‌గా ఇది నిలిచింది.
కాగా ఐపీఎల్‌లో వంద మ్యాచ్‌ల మైలురాయిని చేరుకున్న తొలి ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడిగా రషీద్ ఖాన్ నిలిచాడు. ఇప్పటివరకు 99 మ్యాచుల్లో 6.50 ఏకానమీ రేటుతో రషీద్‌ఖాన్ 126 వికెట్స్ తీసుకున్నాడు.
బ్యాటింగ్‌లో 326 రన్స్ చేశాడు. 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ద్వారా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు రషీద్‌ఖాన్. 2021 వరకు సన్‌రైజర్స్ టీమ్‌లో కీలక ప్లేయర్‌గా కొనసాగాడు. 2018 సీజన్‌లో 17 మ్యాచుల్లోనే 21 వికెట్లు తీసుకొని సత్తాచాటాడు. 2023 సీజన్‌లోనూ 14 వికెట్లతో పర్పుల్ క్యాప్ లీడర్స్ రేసులో సెకండ్ ప్లేస్‌లో రషీద్‌ఖాన్ కొనసాగుతోన్నాడు.
ఐపీఎల్‌లో 100 వికెట్లు సాధించిన యంగెస్ట్ బౌలర్‌గా రషీద్‌ఖాన్ పేరిట రికార్డ్ ఉంది. అంతే కాకుండా ఐపీఎల్‌లో హ్యాట్రిక్ సాధించాడు రషీద్‌ఖాన్. ఐపీఎల్‌లో ఈ ఘనతను సాధించిన ఏకైక ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అతడే కావడం గమనార్హం.
సన్‌రైజర్స్ అతడిని వదులుకోవడంతో 2023 ఐపీఎల్ వేలంలో గుజరాత్ అతడిని 15 కోట్లకు దక్కించుకున్నది. అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాళ్లలో ఒకడిగా రషీద్‌ఖాన్ నిలిచాడు.
టాపిక్