Nirjala ekadashi 2024: నిర్జల ఏకాదశి ఎప్పుడు? దీన్ని అత్యంత క్లిష్టమైన ఉపవాసంగా ఎందుకు చెప్తారు?-nirjala ekadashi 2024 date and why its so importance than all ekadashi thithi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Nirjala Ekadashi 2024: నిర్జల ఏకాదశి ఎప్పుడు? దీన్ని అత్యంత క్లిష్టమైన ఉపవాసంగా ఎందుకు చెప్తారు?

Nirjala ekadashi 2024: నిర్జల ఏకాదశి ఎప్పుడు? దీన్ని అత్యంత క్లిష్టమైన ఉపవాసంగా ఎందుకు చెప్తారు?

Gunti Soundarya HT Telugu
Jun 10, 2024 11:06 AM IST

Nirjala ekadashi 2024: ఏడాదికి 24 ఏకాదశులు ఉంటాయి. వాటన్నింటిలోనూ నిర్జల ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఎందుకు దీని వెనుక ఉన్న కారణం ఏంటి? నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది?

నిర్జల ఏకాదశి 2024
నిర్జల ఏకాదశి 2024

Nirjala ekadashi 2024: ప్రతి నెల ఏకాదశి రెండుసార్లు వస్తుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. ఈ ఉపవాసం జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం ఏకాదశి నాడు ఆచరిస్తారు. పాండవ సోదరులలో ఒకడైన భీముడు ఈ నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడని నమ్ముతారు. అందుకే దీనిని భీముడి ఏకాదశి అని కూడా అంటారు.

నిర్జల ఏకాదశిని పాటించడం వల్ల భీముడు మోక్షం పొందాడని చెబుతారు. అన్ని ఏకాదశులలో ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరం పొడవునా ఏకాదశి ఉపవాసం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది నిర్జల ఏకాదశి జూన్ 18 వచ్చింది.

నిర్జల ఏకాదశి రోజున ఆహారం, నీరు తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. ఇలా చేయడం ద్వారా విష్ణువు తన భక్తులకు సుఖసంతోషాలు సౌభాగ్యాలు ప్రసాదిస్తాడని నమ్ముతారు.

నిర్జల ఏకాదశి వ్రత కథ

పాండవ సోదరులలో భీముడు ఆహార ప్రియుడు. ఒక్కపూట కూడా భోజనం చేయకుండా ఉండలేడు. ఒకసారి తన సోదరులు, తల్లి ఏకాదశి ఉపవాసం ఉంటారని కానీ నెలలో రెండు రోజుల కూడా తాను ఉపవాసం ఉండడం చాలా కష్టంగా ఉంటుందని భీముడు వేదవ్యాసుడికి చెప్తాడు. స్వర్గాన్ని పొందడానికి మోక్షమార్గం లభించేందుకు సంవత్సరానికి ఒకసారి ఆచరించే ఉపవాసం ఏముందని భీముడు వేద వ్యాసుడిని అడిగాడు. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా ఉపవాసం నుండి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం, దానం చేస్తే మోక్షం లభిస్తుందని వ్యాసుడు చెప్పారు. అలా భీముడు నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఆచరించాడు. అందుకే ఈ ఏకాదశికి భీముని ఏకాదశి, పాండవ ఏకాదశి అనే పేరు కూడా ఉంది.

నిర్జల ఏకాదశి పరిహారాలు

జీవితంలో సుఖ సంతోషాల కోసం నిర్జల ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించాలి. విష్ణువుకు చందనం తిలకంగా పూసి ఓం అనిరుద్ధాయ నమః అదే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల శ్రీహరి విష్ణువు తన భక్తులకు సుఖసంతోషాలు ప్రసాదిస్తాడని ప్రతీతి.

జాతకంలోనే అన్ని లోపాలను తొలగించుకునేందుకు నిర్జల ఏకాదశి రోజు నీరు, పండ్లు, పసుపు వస్త్రాలు, చలువ చేసే పదార్థాలు, మామిడి కాయలు, పంచదార మొదలైన వాటిని దానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు.

నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసి మొక్క చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు

నిర్జల ఏకాదశి రోజున విష్ణువుకి పంజరి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. పంజరిలో తులసి ఆకులు ఉంచినది నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి.

ఈ పవిత్రమైన రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే పూజ సమయంలో ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

 

Whats_app_banner