Facebook Meta layoffs: మెటా కూడా మొదలెట్టేసింది.. నేటి నుంచే ఉద్యోగాల కోత!-facebook instagram parent meta likely to start layoffs today mark zuckerberg blames himself ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Facebook Meta Layoffs: మెటా కూడా మొదలెట్టేసింది.. నేటి నుంచే ఉద్యోగాల కోత!

Facebook Meta layoffs: మెటా కూడా మొదలెట్టేసింది.. నేటి నుంచే ఉద్యోగాల కోత!

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 10:43 AM IST

Facebook Parent Meta layoffs: ఫేస్‍బుక్ మాతృసంస్థ మెటా కూడా ఉద్యోగుల ఉద్వాసన ప్రక్రియ మొదలుపెట్టిందని సమాచారం. నేటి నుంచి ఎంప్లాయిస్ తొలగింపును ప్రారంభించనుందని ఓ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది.

ఉద్యోగులను తొలగిస్తున్న ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా
ఉద్యోగులను తొలగిస్తున్న ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (AP)

Facebook Parent Meta layoffs: ప్రస్తుతం టెక్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. భారీ దిగ్గజ సంస్థలు సైతం ఖర్చులను తగ్గించుకునేందుకు అంటూ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఎలాన్ మస్క్ (Elon Musk) చేతుల్లోకి వెళ్లిన పాపులర్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‍ఫామ్ ట్విట్టర్ (Twitter) ఇప్పటికే 50శాతం మంది ఎంప్లాయిస్‍ను ఒకేసారి తీసేసింది.

తాజాగా ఫేస్‍బుక్ మాతృసంస్థ మెటా కూడా ఉద్యోగాల తీసివేతకు ఉపక్రమించింది. ఎంత మంది ఉద్యోగులను తొలగించాలకుంటున్నారో మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg) చెప్పకపోయినా.. కచ్చితంగా తొలగింపులైతే ఉంటాయని సంకేతాలు ఇచ్చారు. అయితే మెటాలో ఉద్యోగుల ఉద్వాసన నేటి నుంచే ప్రారంభం కానుందని ఓ రిపోర్ట్ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇవే.

Mark Zuckerberg’s Facebook Parent Meta layoffs : బాధ్యత నాదే: మార్క్

సంస్థలో కొందరు ఉద్యోగులను తొలగించే ప్రక్రియను మెటా బుధవారమే ప్రారంభిస్తుందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ రిపోర్ట్ లో వెల్లడించింది. సిబ్బందిని తీసేయాలన్న ప్రణాళికలను మంగళవారం వందలాది మంది ఎగ్జిక్యూటివ్‍లతో జరిగిన సమావేశంలో Mark Zuckerberg వెల్లడించారట. అయితే ఈ తతంగానికి సంబంధించిన విమర్శలన్నీ తానే తీసుకుంటానని, కంపెనీ తప్పటగుడులకు తానే బాధ్యత వహిస్తానని Zuckerberg చెప్పినట్టు ఆ రిపోర్ట్ ద్వారా బయటికి వచ్చింది. భవిష్యత్తులో అత్యధిక వృద్ధి ఉంటుందనే ఎక్కువ ఆశాభావ దృక్పథమే అవసరమైన దాని కంటే ఎక్కువ సిబ్బందిని నియమించుకునేలా చేసిందని ఆయన అన్నారని సమాచారం.

Facebook Parent Meta layoffs: ఎంత మంది సిబ్బందిని మెటా తొలగిస్తుందో స్పష్టమైన సంఖ్య అయితే వెల్లడికాలేదు. అయితే వేల సంఖ్యలోనే ఉద్యోగులకు ఉద్వాసన ఉంటుందని గత వారం వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే ట్విట్టర్ తో పోలిస్తే కాస్త తక్కువ శాతంలోనే సిబ్బంది కోత ఉండొచ్చని పేర్కొంది. మెటా పరిధిలోని ఫేస్‍బుక్, వాట్సాప్, ఇన్‍స్టాగ్రామ్‍తో పాటు మిగిలిన ప్లాట్‍ఫామ్‍లలో సుమారు 87,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

ఎక్కువ వృద్ది ఉండే అంశాల్లోనూ తక్కువస్థాయిలోనే పెట్టుబడులు పెట్టాలని కంపెనీ ఆలోచిస్తోందని మెటా ప్రతినిధి ఒకరు ఇటీల వెల్లడించారు. అవసరమైన ట్రావెల్‍ను రద్దు చేసుకోవాలని ఉద్యోగులకు సీనియర్ మేనేజర్లు సూచించారని సమాచారం.

ఈ సంవత్సరం వరుసగా రెండు త్రైమాసికాల్లో మెటా.. రెవెన్యూలో క్షీణతను నమోదు చేసింది. కంపెనీలోని చాలా మంది ఇక్కడ ఉండాల్సిన వారు కాదు అని ఉద్యోగులతో జరిగిన ఓ సమావేశంలో జుకర్ బర్గ్ అప్పుడు చెప్పారు. ఇక ఆ సంస్థలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని అప్పటి నుంచి అంచనాలు వెలువడ్డాయి. మొత్తంగా ఇప్పుడు ఉద్యోగుల తొలగింపును మెటా మొదలుపెట్టనుందని సమాచారం.

ట్విట్టర్ లో సుమారు 3,700 మందిని ఇటీవలే ఎలాన్ మస్క్ తొలగించారు. ఇండియాలో పని చేస్తున్నట్టు ట్విట్టర్ ఉద్యోగుల్లో 90శాతం మందిని తీసేశారు. అయితే పొరపాటుగా తీసేశామంటూ మళ్లీ కొందరు ఉద్యోగులను ట్విట్టర్ వెనక్కి పిలుస్తోంది. ట్విట్టర్ ఇండియాలో సుమారు 200 మంది ఉండగా.. కేవలం 25 మంది ఉద్యోగులనే కొనసాగించింది.

IPL_Entry_Point