JEE Advanced 2024 : రేపు.. జేఈఈ అడ్వాన్స్డ్ ఆన్సర్ కీ విడుదల- ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
JEE Advanced 2024 answer key : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఆన్సర్ కీని రేపు, జూన్ 2, 2024న విడుదల చేయనున్నారు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
How to check JEE Advanced 2024 answer key : ఐఐటీ, మద్రాస్ జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఆన్సర్ కీని.. జూన్ 2న విడుదల చేయనుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్డ్ 2024కు హాజరైన అభ్యర్థులు.. jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ నుంచి ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రొవిజనల్ ఆన్సర్ కీని అడ్వాన్స్డ్ చేసుకోవడానికి రేపు ఉదయం 10 గంటలకు లింక్ యాక్టివేట్ అవుతుంది.
పేపర్ 1, పేపర్ 2 రెండింటికీ సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలను జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఆన్లైన్ పోర్టల్లో ప్రదర్శిస్తారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీని ప్రదర్శించిన తర్వాత అభ్యర్థులు తమ ఫీడ్‌బ్యాక్ ఏవైనా ఉంటే క్యాండిడేట్ పోర్టల్లో సమర్పించవచ్చు. అబ్జెక్షన్ విండో రేపు ప్రారంభమై 2024 జూన్ 3న ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఆన్సర్ కీని ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవాలంటే అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
- jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.
- JEE Advanced 2024 answer key : కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయవచ్చు.
- సబ్మిట్పై క్లిక్ చేస్తే మీ ఆన్సర్ కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఆన్సర్ కీ చెక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచుకోండి.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 క్యాండిడేట్ పోర్టల్ నుంచి పేపర్-1, పేపర్-2 పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సమాధానాలు వీక్షించడం, డౌన్లోడ్ చేసుకోవడం, ముద్రించడం కోసం అందుబాటులో ఉంటాయి.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు జూన్ 9, 2024 (ఆదివారం) విడుదల కానున్నాయి. కేటగిరీల వారీగా ఉత్తీర్ణులైన అభ్యర్థుల ఆల్ ఇండియా ర్యాంకులు (ఏఐఆర్) ఫలితాలు వెలువడిన తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఆన్లైన్ పోర్టల్ ద్వారా లభిస్తాయి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్ డ్ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రెస్పాన్స్ షీట్ విడుదల..
JEE Advanced 2024 results : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షల రెస్పాన్స్ షీట్స్‌ను మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శుక్రవారం విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2024 అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in లో తమ రెస్పాన్స్ షీట్లను చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం