Manipur floods : మణిపూర్‌లో వరద బీభత్సం.. లక్షలాది మందిపై ప్రభావం!
Manipur floods : భారీ వరదలకు మణిపూర్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటిక నలుగురు మరణించారు. లక్షలాది మందిపై వరద ముప్పు ప్రభావం పడింది.
Manipur floods latest news : మణిపూర్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. రెమాల్ తుపాను కారణంగా భారీ వర్షాలు, వరదలు సృష్టించిన అలజడులకు నలుగురు మరణించారు. మరో 13మంది గాయపడ్డారు. లక్షలాది మందిపై వరదల ప్రభావం పడింది!
వరద ముప్పులో మణిపూర్..
రెమాల్ తుఫాను కారణంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఈ ఈశాన్య రాష్ట్రమంతా భారీ వరదలు సంభవించాయి. ఇంఫాల్ నగరం నుంచి ప్రవహించే చాలా నదుల్లో నీటి మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి.
Manipur floods 2024 : ఇంఫాల్ స్థానిక వార్తాపత్రిక ప్రకారం.. మే 28 నుంచి మే 31 వరకు వరుసగా ఐదుగురు మరణించారు. సహాయ, విపత్తు నిర్వహణ శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, రాష్ట్రంలో 255 గ్రామాలు / ప్రాంతాల్లో మొత్తం 1,26,950 మంది ప్రభావితమయ్యారు. 16,364 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న 20,504 మంది ప్రజలను తరలించారు. 522 హెక్టార్ల పంట ప్రాంతాలు నష్టపోయాయి. కొండ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో గత మూడు రోజుల్లో 292 కొండచరియలు విరిగిపడ్డాయి. బాధితుల కోసం 51 సహాయక శిబిరాలను ప్రారంభించినట్లు అధికారిక నివేదిక తెలిపింది.
ఆదివారం నుంచి.. ఇంఫాల్ గుండా ప్రవహించే చాలా నదులలో నీటి మట్టాలు వేగంగా పెరిగాయి. రెండు ప్రధాన నదులు ఇప్పటికే ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
Manipur floods dealth toll : ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో వైమానిక దళం, నౌకాదళం, సైన్యాన్ని మోహరించారు.
ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, జిరిబామ్, నోనీ, కాంగ్పోక్పి, తమెంగ్లాంగ్, చందేల్, చురాచంద్పూర్, సేనాపతి, కక్చింగ్ సహా పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక సామగ్రిని పంపిణీ చేశారు.
ఇప్పటివరకు 969 మంది పురుషులు, 992 మంది మహిళలు, 601 మంది పిల్లలతో సహా మొత్తం 2,561 మందిని రక్షించినట్లు రెస్క్యూ మిషన్‌లో మోహరించిన అసోం రైఫిల్స్ తెలిపింది.
అసోం రైఫిల్స్‌కు చెందిన పదహారు దళాలు.. మే 30న 2,050 మందికి, మే 31న 3,000 మందికి ప్యాక్ చేసిన ఆహారాన్ని పంపిణీ చేశాయి.
Floods in Manipur : ఇంఫాల్ పట్టణం, చుట్టుపక్కల వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటి మట్టాలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే ప్రధాన మార్కెట్ ప్రాంతాలు (ఎంజీ అవెన్యూ, తంగల్ బజార్, పానా) ఇంకా నీటిలోనే ఉండగా, బిష్ణుపూర్ జిల్లాలోని నాంబోల్.. వరదలకు ప్రభావితమైన జాబితాలో తాజాగా చేరింది.
శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినీత్ జోషితో కలిసి ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఇంఫాల్‌లోని వరద ప్రభావిత పానా బజార్‌ను సందర్శించారు.
"రెమాల్ తుఫాను తరువాత మణిపూర్‌లో వరద పరిస్థితి గురించి గౌరవనీయ హోం మంత్రి శ్రీ అమిత్ షా నుంచి నాకు ఫోన్ వచ్చింది. పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన అందించిన సహాయానికి, అచంచల నిబద్ధతకు మేం నిజంగా కృతజ్ఞులం,' అని సీఎం పేర్కొన్నారు.
Manipur floods latest news : 'ఈ క్లిష్ట సమయంలో మణిపూర్ ప్రజలను ఆదుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం రెమాల్ తుపాను బాధితులను ఆదుకోవాలన్న మీ అచంచల నిబద్ధతకు నిదర్శనం," అన్నారు సీఎం.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం