World Liver Day 2023 । క్యారెట్ బీట్‌రూట్ శాండ్‌విచ్.. కాలేయ ఆరోగ్యానికి మంచి బ్రేక్‌ఫాస్ట్!
World Liver Day 2023: కాలేయానికి మేలు చేసే ఆహారాలలో క్యారెట్లు, బీట్‌రూట్ ముందుంటాయి. ఈ రెండూ కలగలసిన క్యారెట్ బీట్‌రూట్ శాండ్‌విచ్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.
World Liver Day 2023: ఈరోజు ప్రపంచ కాలేయ దినోత్సవం. శరీరంలో కీలక అవయవం అయిన కాలేయాన్ని ఆరోగ్యం కాపాడుకోవడం గురించి ప్రతీ ఏడాది ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవంగా నిర్వహిస్తారు. కాలేయ ఆరోగ్యంలో ఆహారం కీలకం. కొన్ని ఆహారాలు కాలేయానికి హాని చేస్తే మరికొన్ని మేలు చేస్తాయి. కాలేయానికి మేలు చేసే ఆహారాలలో (Liver Healthy Foods) క్యారెట్లు, బీట్‌రూట్ ముందుంటాయి.
క్యారెట్‌లలో ప్లాంట్-ఫ్లేవనాయిడ్స్, బీటా-కెరోటిన్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఇవి కాలేయ పనితీరును పెంచుతాయి. క్యారెట్‌లో ఉండే విటమిన్ ఎ లివర్ వ్యాధిని నివారిస్తుంది. బీట్‌రూట్ విటమిన్ సికి మంచి మూలం, బీట్‌రూట్ సిట్రస్ పండ్ల వలె పిత్తాన్ని ప్రేరేపిస్తుంది, ఎంజైమాటిక్ కార్యకలాపాలను పెంచుతుంది. ఈ రెండూ కలగలసిన క్యారెట్ బీట్‌రూట్ శాండ్‌విచ్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.
క్యారెట్ బీట్‌రూట్ శాండ్‌విచ్‌ను మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ (Liver Healthy Breakfast) గా, సాయంత్రం చిరుతిండి (Tea Time Snack) గా కూడా ఆస్వాదించవచ్చు. కేవలం 20 నిమిషాలలోపు ఈ అల్పాహారాన్ని సిద్ధం చేయవచ్చు. ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Carrot Beetroot Sandwich Recipe కోసం కావలసినవి
- 1 మీడియం బీట్‌రూట్
- 1 మీడియం క్యారెట్
- 6 బ్రెడ్ ముక్కలు (మల్టీగ్రెయిన్ లేదా వోల్ వీట్ లేదా గార్లిక్)
- 1/4 కప్ క్రీమ్ చీజ్ స్ప్రెడ్ లేదా మయోసాస్ లేదా చిక్కటి పెరుగు
- 2 టేబుల్ స్పూన్ వెన్న
- 1/4 టీస్పూన్ నల్ల మిరియాల పొడి
- 1/8 టీస్పూన్ ఇటాలియన్ మసాలా
- ఉప్పు రుచికి తగినంత
క్యారెట్ బీట్‌రూట్ శాండ్‌విచ్ తయారీ విధానం
- బీట్‌రూట్ , క్యారెట్‌ను శుభ్రం చేసి తొక్కతీసి తురుముకొని సిద్ధంగా పెట్టుకోండి.
- ఇప్పుడు ఈ బీట్‌రూట్, క్యారెట్ తురుమును ఒక మిక్సింగ్ గిన్నెలో తీసుకోండి. ఇందులో క్రీమ్ చీజ్ స్ప్రెడ్, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇటాలియన్ మసాలా, ఉప్పును వేసి అన్నీ బాగా కలపండి.
- ఇప్పుడు బ్రెడ్ స్లైస్‌లను తీసుకుని, ముందుగా వాటిపై కొంచెం బటర్ అప్లై చేయండి,
- ఆపైన బీట్‌రూట్ క్యారెట్ చీజ్ మిశ్రమాన్ని బ్రెడ్‌లోని ఒక స్లైస్‌పై ఉదారంగా వర్తించండి. దానిపై మరో బ్రెడ్ స్లైస్‌తో మూతపెట్టి వత్తుకోవాలి.
- ఇప్పుడు తవా లేదా శాండ్‌విచ్ మేకర్‌ను వేడి చేయండి, కాస్త వెన్న పూయండి, ఆపైన శాండ్‌విచ్‌ను ఉంచండి.
- రెండు వైపులా బ్రెడ్ బంగారు గోధుమ రంగు వచ్చే వరకు టోస్ట్ చేయండి.
అంతే, క్యారెట్ బీట్‌రూట్ శాండ్‌విచ్. టొమాటో కెచప్‌తో శాండ్‌విచ్‌లను వేడివేడిగా సర్వ్ చేయండి.
సంబంధిత కథనం
టాపిక్