World Kebab Day। చికెన్ కల్మీ కబాబ్.. ఎర్రగా కాల్చుకోండి, రుచికరమైన వేడుక చేసుకోండి!
World Kebab Day 2023: ఈరోజు ప్రపంచ కబాబ్ దినోత్సవం. ఈ సందర్భంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన వేడుక చేసుకోండి. ఇక్కడ చికెన్ కల్మీ కబాబ్ రెసిపీని (Chicken Kalmi Kebab recipe) అందిస్తున్నాము.
World Kebab Day 2023: కబాబ్‌లు తినడం అంటే ఎవరు ఇష్టపడరు? మాంసం ముక్కలను వివిధ రకాల మసాలా దినుసులతో మెరినేట్ చేసి, ఎర్రగా కాల్చుకొని తింటుంటే దాని రుచే వేరు. ప్రజలు చికెన్, మటన్, ఫిష్ ఇలా అనేక ఇతర రకాల కబాబ్‌లను ఆస్వాదిస్తారు. మాంసాహార ప్రియులకు ఈ కబాబ్‌లు పార్టీలో మంచి స్టఫ్. మరి శాకాహారాలు ఏం కావాలి? వారు కూడా రుచికరంగా సోయాబీన్ కబాబ్‌లు లేదా పనీర్ కబాబ్‌లను తయారు చేసుకోవచ్చు.
మీకు తెలుసా? ఈరోజు ప్రపంచ కబాబ్ దినోత్సవం. ప్రతి సంవత్సరం, జూలై నెలలో వచ్చే రెండవ శుక్రవారంను ప్రపంచ కబాబ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూలై 14న ప్రపంచ కబాబ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ కబాబ్ రుచులను పరిచయం చేస్తూ కబాబ్‌లను విశ్వవ్యాప్తం చేయడం ఈరోజుకు ఉన్న ప్రత్యేకత.
మీరు కూడా ఈ కబాబ్ డే నాడు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన వేడుక చేసుకోండి. చల్లని వర్షాకాలపు వాతావరణాన్ని కబాబ్ తింటూ ఆస్వాదించండి. మీ కోసం ఇక్కడ చికెన్ కల్మీ కబాబ్ రెసిపీని అందిస్తున్నాము.
Chicken Kalmi Kebab Recipe కోసం కావలసినవి
- 3 చికెన్ లెగ్ పీస్‌లు
- 1/4 కప్పు చిక్కటి పెరుగు
- 1 టేబుల్ స్పూన్ తాజా క్రీమ్/ మీగడ
- 1 అంగుళం అల్లం
- 4 వెల్లుల్లి
- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
- 1/4 టీస్పూన్ పసుపు పొడి
- 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు
- 1 టీస్పూన్ జీలకర్ర పొడి
- 1 టీస్పూన్ గరం మసాలా పొడి
- 1 టీస్పూన్ రెడ్ చిల్లీ పౌడర్
- 1 టీస్పూన్ నల్ల మిరియాలు పొడి
- ఉప్పు రుచికి తగినంత
చికెన్ కల్మీ కబాబ్ ఎలా తయారు చేయాలి
- కల్మీ కబాబ్ రెసిపీని తయారు చేయడం ప్రారంభించడానికి ముందుగా చికెన్ లెగ్ ముక్కలను బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోండి.
- ఒక మిక్సర్ జార్‌లో జీడిపప్పును వేసి, కొన్ని నీళ్లు పోసి సన్నని మందపాటి పేస్ట్‌గా రుబ్బుకోవాలి. దీనిని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి.
- ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో పెరుగు, మీగడ, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
- ఆపైన పసుపు పొడి, జీడిపప్పు పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం పొడి, మిరియాల పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలపండి. మెరినేడ్ సిద్దం అయింది.
- ఇప్పుడు చికెన్ ముక్కలను, సిద్ధం చేసుకున్న మెరినేడ్‌తో బాగా కోట్ చేసి, కనీసం 30 నిమిషాలు ఉంచాలి లేదా రాత్రిపూట మెరినేట్ చేయడానికి ఫ్రిజ్‌లో ఉంచితే మరింత రుచిగా ఉంటుంది.
- ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ లో కొంచెం నూనె వేసి, వేడి చేయండి. నూనె వేడయ్యాక దానిపై మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి, లోతైన బంగారు రంగులోకి వచ్చే వరకు అధిక వేడి మీద వేయించాలి.
- ముక్కలను తిప్పుతూ అన్నివైపులా బంగారు రంగు వచ్చేవరకు అధిక వేడి మీద వేయించాలి. ఆపైన మూతపెట్టి 10-15 నిమిషాలు మీడియం వేడి మీద ఉడికించాలి.
అంతే, చికెన్ కల్మీ కబాబ్ రెడీ. ఉల్లిపాయ ముక్కలు, పెరుగు పుదీనా చట్నీతో పార్టీ స్టార్టర్‌గా అందించండి. లేదా అన్నంతో పాటు సైడ్ డిష్‌గా తింటూ ఆనందించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్