Women Fitness : ఇలా చేస్తే మహిళలు చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు
అందరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు, కానీ అనేక కారణాల వల్ల మన శరీర బరువు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వివాహం తర్వాత శరీరంపై పెద్దగా శ్రద్ధ చూపరు, బరువు పెరుగుతారు. మీరు ఫిట్‌నెస్‌ని పొందడానికి, బలమైన కండరాలను పొందడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. ప్లాంక్ వ్యాయామం చేస్తే ప్రయోజనాలు పొందుతారు.
ప్లాంక్ అనేది కష్టమైన వ్యాయామం కాదు. ఏ వయసు వారైనా ఆచరించదగిన భంగిమ ఇది. శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా అనిపించినా తర్వాత బాగానే ఉంటుంది. ప్లాంక్ అనేది ముందుగా 30 సెకండ్లు, తర్వాత 1 నిమిషం, 2 నిమిషాలకు పెంచవచ్చు. ఈ భంగిమలో రోజుకు 2 నిమిషాలు సరిపోతుంది, వీలైతే 5 నిమిషాలు కొనసాగించవచ్చు. కానీ ప్లాంక్ చేయడానికి మీ శరీర భంగిమ సరిగ్గా ఉండాలి. వీడియోలను చూడటం లేదా నిపుణులను సంప్రదించడం ద్వారా ప్రారంభించండి.
ప్లాంక్ చేస్తే.. దిగువ ఉదర కండరాలను బిగుతుగా, బలపరుస్తుంది. దిగువ ఉదర కండరాలను బిగించి.. మీ గర్భాశయ ఆరోగ్యానికి మంచిది. ప్లాంక్ వేసి.. ఏ ఆసరా లేకుండా కాలు మీద పైకి లేచి.. వృక్షాసనంలో ఒంటికాలిపై నిలబడితే కచ్చితంగా శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు.
ఫ్లెక్సిబుల్ బాడీ ఉండటం ఏ వయసులోనైనా మంచిది. కానీ కొందరికి 30 ఏళ్లు దాటే కొద్దీ అది పోతుంది. నేల మీద కూడా కూర్చోలేరు. ఈ రోజు నుండి ప్లాంక్ ప్రారంభించండి.. చాలా ఉపయోగాలు ఉంటాయి. మెటబాలిజం సవ్యంగా ఉంటే.. శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. రోజువారీ ప్లాంక్ శరీరానికి శక్తిని బాగా వినియోగించుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా ఊబకాయం రాదు. చాలా మంది మహిళల సమస్య ఉదర స్థూలకాయం, ఊబకాయాన్ని నివారించడంలో ప్లాంక్ బాగా ఉపయోగపడుతుంది.
ఇల్లు, పిల్లలు, పని వంటి అన్ని బాధ్యతలను నిర్వహించడం అంత సులభం కాదు. కొన్నిసార్లు మానసిక స్థితి కలత చెందుతుంది. బోరింగ్ అవుతుంది. కానీ మీరు రోజూ ప్లాంక్ సాధన చేస్తే, ఈ రకమైన మూడ్ స్వింగ్ తగ్గిపోతుంది. మీకు కోపం రాదు.
మీరు బహిష్టు సమయంలో విపరీతమైన నొప్పితో బాధపడుతుంటే ఈ ప్లాంక్ ఆచరించడం వల్ల ఆ సమయంలో నొప్పి తగ్గుతుంది. ప్లాంక్‌ను ఖాళీ కడుపుతో ఉదయం ప్రాక్టీస్ చేయండి. మీరు దీన్ని ఇతర సమయాల్లో కూడా చేయవచ్చు. కానీ ఈ భంగిమను ప్రాక్టీస్ చేయడానికి 2 గంటల ముందు ఏమీ తినవద్దు.
భుజం గాయం, మెడ నొప్పి, పెల్విక్ నొప్పి ఉంటే ప్లాంక్ చేయకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా ఈ వ్యాయామం జోలికి అస్సలు వెళ్లకూడదు.