Weight Loss: స్ట్రిక్ట్ డైట్ లేకుండా 21 రోజుల్లో 7 కేజీల బరువు ఎలా తగ్గానో చెప్పిన మహిళ.. ఆమె ఫాలో అయిన పద్దతులు ఇవే
Weight Loss: తాను 21 రోజుల్లో 7 కేజీల బరువు తగ్గానంటూ ఓ న్యూట్రిషనిస్ట్ సోషల్ మీడియాలో వెల్లడించారు. స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావాలని చెప్పారు. అందుకు తాను ఏ పద్ధతులు పాటించానో వివరించారు. ఆ వివరాలు ఇవే..
బరువు తగ్గేందుకు పోషకాహాలతో కూడిన డైట్ చాలా ముఖ్యం. ఏది.. ఎంత తింటున్నామనే విషయంపై వెయిట్ లాస్ చాలా ఆధారపడి ఉంటుంది. ఆహారం, వ్యాయామం బరువు తగ్గేందుకు చాలా ముఖ్యం. ఏ సమయంలో తింటున్నామనేది కూడా కీలకమైన విషయమే. కొందరు డైట్‍ను అంత కఠినంగా పాటించకపోయినా.. తినే సమయం, మోతాదును మేనేజ్ చేసుకుంటూ కూడా బరువు తగ్గుతారు. ఇలాంటి విషయాన్నే న్యూట్రిషనిస్ట్ తనూ గోస్వామి తాజాగా వెల్లడించారు. తాను స్ట్రిక్ట్ డైట్ ఫాలో కాకుండానే 21 రోజుల్లో 7 కేజీలు తగ్గానని చెప్పారు. అయితే, అందుకు ఆమె ఫాలో అయిన విధానాలను వివరించారు.
ఇంటర్మెంటెంట్ ఫాస్టింగ్, నడక, ప్రొటీన్
తాను 21 రోజుల పాటు ఫాలో అయిన విషయాలను తనూ గోస్వామి వెల్లడించారు. రోజులో ఆహారాన్ని 8 గంటల వ్యవధిలోనే తిని.. మిగిలిన 16 గంటల పాటు ఇంటర్మెంటెంట్ ఫాస్టింగ్ చేసినట్టు తెలిపారు. 21 రోజుల పాటు ఇది చేసినట్టు వెల్లడించారు. ప్రతీ రోజు 10,000 అడుగుల నడక, 8 గంటల నిద్ర, 4 లీటర్ల నీరు, శరీర బరువులో ప్రతీ కేజీకి ఓ గ్రాము ప్రొటీన్ తీసుకున్నానని వెల్లడించారు.
బరువు తగ్గడం అనేది కఠినంగా డైట్ పాటించడం మాత్రమే కాదని నీతూ గోస్వామి విధానం బట్టి అర్థమవుతుంది. సరిపడా నీరు తాగడం, కావాల్సినంత నిద్ర కూడా చాలా ముఖ్యం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా వెయిట్ లాస్‍కు ప్రభావవంతంగా ఉంటుంది. ప్రతీ రోజు ఓ నిర్దిష్ట సమయలోనే ఆహారం తీసుకొని.. మిగిలిన టైమ్‍లో తినకుండా ఉంటే జీవక్రియ మెరుగ్గా ఉండి బరువు తగ్గడం వేగవంతం అవుతుంది.
నడుము 3 ఇంచులు తగ్గింది
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్లే తాను వేగంగా బరువు తగ్గగలిగానని తనూ వెల్లడించారు. “ఇది కేవలం బరువు తగ్గేందుకే కాదు.. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. నేను 21 రోజుల పాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేశా. ఫలితాలు అద్భుతంగా కనిపించాయి. నేను 7 కేజీల బరువు తగ్గా. నా నడుము 3 ఇంచులు తగ్గింది. నా చర్మం మెరుగయ్యేందుకు కూడా సహకరించింది” అని గోస్వామి చెప్పారు. ఈ ఫాస్టింగ్ వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని, జీవక్రియ మెరుగై వెయిట్ లాస్ వేగంగా అవుతుందని కూడా ఆమె వెల్లడించారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇలా..
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కోసం కొన్ని టైమ్ విండోస్ ఉంటాయి. మూడు పద్ధతులను ఆ న్యూట్రిషనిస్ట్ వెల్లడించారు. మొదటికి 16:8. దీంట్లో రోజులో 8 గంటల వ్యవధిలో తినేసి.. మిగిలిన 16 గంటల్లో ఏమీ తినకుండా ఫాస్టింగ్ చేయాలి. ఇలాగే 12:8, 11:7 కూడా పాటించవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా పాటించవచ్చు. 5:2 అనేది రెండో రకం. వారంలో 5 రోజుల పాటు సాధారణంగా తిని.. రెండు రోజులు పూర్తిగా ఫాస్టింగ్ ఉండాలి. ఇది కాస్త తీవ్రంగా ఉంటుంది. అయితే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కొత్తగా చేస్తున్న వారు ఆరంభంలో 14:10 చేస్తే మేలు. అంటే రోజులో 10 గంటల వ్యవధిలో తిని.. 14 గంటలు ఫాస్టింగ్ చేయాలి. ఆ తర్వాత క్రమంగా ఫాస్టింగ్ చేసే టైమ్‍ను పెంచుకోవచ్చు. ఫాస్టింగ్ చేసే సమయంలో నీరు తాగొచ్చు. అయితే, ఫాస్టింగ్ టైమ్‍లో పండ్ల జ్యూస్‍లు, కొబ్బరినీళ్లు, పాలు, టీ, కాఫీలు తీసుకోవద్దని నీతూ గోస్వామి సూచించారు.