టైప్‌-2 మధుమేహం నియంత్రణలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫలితాలనిస్తోంది.

By Bolleddu Sarath Chandra
Oct 23, 2024

Hindustan Times
Telugu

మధుమేహం నియంత్రణలో బేరియాట్రిక్ సర్జరీలతో వచ్చే ప్రయోజనాలు తాత్కలికమేనని రుజువయ్యాయి.

ఆహారాన్ని తగ్గించడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వచ్చినట్టు పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహంలో గ్లూకోజ్‌ ప్రధాన సమస్య కావడంతో  చక్కెర తీసుకోవడాన్ని పూర్తిగా ఆపేయాలి.

మధుమేహం నియంత్రణలోకి రావాలంటే శరీరంలో అదనంగా నిల్వ ఉన్న చక్కెర్లను కరిగించాలి. వ్యాయామంతో కొంత మేరకే ఫలితం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

శరీరానికి అందించే కెలరీలను క్రమంగా తగ్గించడం ద్వారా ఫలితాలు ఆలస్యం కావొచ్చు.  ఉపవాసం పద్ధతిలో అదనంగా ఉన్న నిల్వలను స్థిరంగా కరిగించవచ్చు. ఉపవాసం ద్వారా శరీర బరువును వేగంగా తగ్గించుకోవచ్చు. 

శరీరానికి కార్బోహైడ్రేట్లను తగ్గించడం కంటే ఉపవాసం పద్దతిలో ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. లో కార్బ్ హెల్తీఫాట్ డైట్, ఉపవాసం వల్ల ఎక్కువ ప్రయోజనాలు దక్కుతాయి..

ఉపవాసం, లో కార్బ్ డైట్‌లలో రెండింటిని కలిపి చేస్తే పలితాలను త్వరగా అందుకోవచ్చు. ఏళ్ల తరబడి ఉన్న టైప్‌ 2 మధుమేహాన్ని కూడా ఈ పద్ధతిలో వెనక్కి తీసుకురావొచ్చు. 

మధుమేహంలో శరీరంలో ఉన్న చక్కెర నిల్వలను తొలగించడమే అధిక బరువును తగ్గించుకోవడం, ఉపవాసంతో పాటు మందులను కూడా కొనసాగిస్తూ ఫలితాలను త్వరగా పొందవచ్చు. ఉపవాసంలో గ్లూకోజు తగ్గినట్ట గుర్తించగానే చక్కెర పదార్ధం తినాల్సి ఉంటుంది. 

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels