Winter Cold Bath : చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త..-winter cold baths are dangerous they increase heart diseases ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Winter Cold Baths Are Dangerous They Increase Heart Diseases

Winter Cold Bath : చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 19, 2022 10:07 PM IST

Cold Water may Cause Heart Disease : చలికాలంలో వేడినీళ్లతో స్నానం చేయకూడదు అంటారు. మరి కొందరు చన్నీళ్లతో స్నానం చేస్తే మంచిది అంటారు. మరికొందరు అసలు స్నానమే చేయరు. మరి ఇంతకీ చలికాలంలో ఏ నీళ్లతో స్నానం చేయాలి? స్నానం చేయకపోతే ఏమవుతుందో.. చన్నీళ్లతో స్నానం చేస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా?
చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా?

Cold Water may Cause Heart Disease : చలికాలంలో కొందరు బద్ధకంతో స్నానం చేయరు. మరికొందరు వేడి నీళ్లతో స్నానం చేయకూడదు చర్మం పాడైపోతుంది అంటారు. మరికొందరు ఎంత చల్లగా ఉన్నా చన్నీళ్లతోనే స్నానం చేస్తారు. ఇంతకీ ఏ నీళ్లతో స్నానం చేస్తే మంచిది. అసలు నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో చాలా మంది స్నానం చేయడానికి బద్ధకిస్తారు. కానీ ఎంత చలిగా ఉన్నా స్నానం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. లేదంటే చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం నుంచి మీ చర్మంపై పేరుకుపోయిన మురికి వదలించుకుంటేనే.. మీ స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే.. మీకు సరిగా నిద్ర కూడా పట్టదు. సరైన నిద్ర కావాలంటే మీరు కచ్చితంగా ఫ్రెష్ అవ్వాల్సిందే. అలాగే ఏకాలమైనా పూర్తిగా చన్నీళ్లతో స్నానం చేసే వారు కొందరు ఉంటారు. అది అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్త ప్రసరణకు ఆటంకం..

చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల గుండె జబ్బులు పెరుగుతాయి. శరీరం చల్లటి నీటికి గురైనప్పుడు.. సిరలు కుంచించుకుపోతాయి. ఫలితంగా.. రక్త ప్రసరణ చెదిరిపోతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

న్యుమోనియా

గుండె జబ్బులతో పాటు న్యుమోనియా వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. చల్లటి నీళ్లలో స్నానం చేయడం వల్ల శరీరం అంత తేలికగా వేడెక్కదు. ఇది ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది.

నివారణులు

గుండె జబ్బులు, న్యుమోనియా నివారించడానికి.. చల్లని నీటితో స్నానం చేయకపోవడమే మంచిది. వేడి నీళ్లతో స్నానం చేస్తే అలాంటి ప్రమాదం ఉండదు. వేడి నీటితో స్నానం చేయడంతో పాటు.. శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి వెచ్చని బట్టలు ధరించాలి.

అంతేకాకుండా ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో పౌష్టికాహారంతో పాటు సీజనల్ పండ్లు, కూరగాయలు తీసుకోవచ్చు. ఈ సమయంలో రెగ్యులర్ వ్యాయామం కూడా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. అలాగే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

కాబట్టి చలికాలంలో చన్నీళ్లు కాకుండా, వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే.. ఆరోగ్యానికి, శరీరానికి కూడా మంచిది అంటున్నారు. ఆఫీస్ ముగిసిన తర్వాత హాయిగా గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే.. చక్కని నిద్రకూడా పొందవచ్చు అంటున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్