Benefits of Ghee in Winters । చలికాలంలో నెయ్యి తప్పకుండా తినాలి, ఎందుకంటే?!-know amazing benefits of ghee in winters the best ayurvedic medicine for cold ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Benefits Of Ghee In Winters । చలికాలంలో నెయ్యి తప్పకుండా తినాలి, ఎందుకంటే?!

Benefits of Ghee in Winters । చలికాలంలో నెయ్యి తప్పకుండా తినాలి, ఎందుకంటే?!

HT Telugu Desk HT Telugu
Nov 17, 2022 03:07 PM IST

Benefits of Ghee in Winters । చలికాలంలో మీరు నెయ్యి తింటున్నారా? తినకపోతే తినడం ప్రారంభించండి. ఈ సీజన్ లో నెయ్యితో ఎన్ని ప్రయోజనాలో ఇక్కడ తెలుసుకోండి.

Benefits of Ghee in Winters
Benefits of Ghee in Winters (Unsplash)

తెలుగు వారి భోజనంలో నెయ్యి లేకపోతే అది అసంపూర్ణమైన భోజనమే. మనం ఉదయం అల్పాహారంలో ఇడ్లీల దగ్గరి నుంచి మధ్యాహ్నం ముద్దపప్పులో, సాయంత్రం అల్పాహారాలలో ప్రతిపూట నెయ్యిని తినేందుకు ఇష్టపడతాం. ఈ సూపర్‌ఫుడ్ ఆహారం సువాసనను, రుచిని మరింత పెంచుతుంది. అంతేకాదు నెయ్యి తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో నెయ్యి తింటే అది రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

భారతీయ పురాతన వైద్య శాస్త్రమైన ఆయుర్వేదం ప్రకారం, నెయ్యి అనేది 'సంస్కార అనువర్తనము'. అంటే నెయ్యి వంటలో వండితే రుచి పెరుగుతుంది, తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొనడం జరిగింది. నెయ్యి సహజంగానే వేడి లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ చలికాలంలో చలిని తట్టుకునేందుకు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. దగ్గు, జలుబుకు కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆరోగ్యవంతమైన మెరిసే చర్మం కోసం, మెరుగైన జ్ఞాపకశక్తికి నెయ్యిని పలు రకాలుగా ఉపయోగించవచ్చు.

Benefits of Ghee in Winters- చలికాలంలో నెయ్యి ప్రయోజనాలు

ఈ శీతాకాలంలో నెయ్యిని ప్రతిరోజూ ఆహారంలో కలుపుకొని తినమని ఆయుర్వేద నిపుణులు పాటిల్ పేర్కొన్నారు. ఈ చల్లటి వాతావరణంలో నెయ్యి శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలిగిస్తుందో వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెచ్చదనం

శీతాకాలంలో శరీరాలకు వెచ్చదనాన్ని అందించే గుణాలు నెయ్యిలో ఉన్నాయి. నెయ్యి తటస్థ రుచిని కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని ఏ వంటకంలో వేసినా, ఆ వంటకం నాణ్యత పెరుగుతుంది, రుచి పెరుగుతుంది. అందుకే నెయ్యిని అన్నంలో, రోటీలలో, పప్పులో, పాయసంలో ఎందులోనైనా కలుపుకొని తినవచ్చు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

నెయ్యి తినడం ద్వారా పేగు ఆరోగ్యంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: నెయ్యిలోని పోషకాలలో గ్యాస్ట్రిక్ రసాలు కూడా ఉంటాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. సాధారణంగా గ్యాస్ట్రిక్ రసాలలో ఆహారాన్ని సరళంగా మార్చే ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి ఆహారాన్ని మృదువుగా మార్చి, ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. అందుకే భోజనంలో ఒక టీస్పూన్ నెయ్యి కలుపుకోవాలని సిఫారసు చేస్తున్నారు.

జలుబు, దగ్గుకు ఔషధం

నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. ఇది దగ్గు, జలుబు వంటి సీజనల్ అనారోగ్యాలకు చికిత్స చేయడంలో ప్రభావవంతమైన ఔషధంగా పనిచేస్తుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని గోరువెచ్చగా చేసి రెండు చుక్కలు నాసిక రంధ్రాలలో వేస్తే జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.

చర్మానికి లోపలి నుండి తేమ

నెయ్యి ఒక సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌. దీనిని చర్మానికి బాహ్యవైపు నుంచి అప్లై చేసినప్పటికీ, లోపలి నుంచి కూడా తేమగా ఉంచుతుంది. నెయ్యితో మీ చర్మం మృదువుగా, కోమలంగా మార్చుకోవచ్చు. మీ స్కాల్ప్ కూడా డ్రైగా ఉంటే నెయ్యిని తలకు కూడా అప్లై చేసుకోవచ్చు, వెంట్రుకలకు మంచి పోషణ అందిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం